Moviesపుష్ప2 టీజర్ టాక్ : ఆ విషయంలో డీప్ గా హర్ట్...

పుష్ప2 టీజర్ టాక్ : ఆ విషయంలో డీప్ గా హర్ట్ అయిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. తప్పు చేశావు సుకుమార్..!

నిన్న బన్నీ బర్త్డ డే సందర్భంగా పుష్ప2 సినిమా నుంచి ఎక్స్క్యూజియో టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప 2 గతంలో తెరకెక్కిన పుష్ప 1 సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా రాబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన నటించబోతుంది. ఈ మధ్యనే ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన లుక్ ను రివిల్ చేశారు మేకర్స్ .

చాలా భయానకంగా చాలా గంభీరంగా చాలా వైలెంట్ లుక్ లో బెదరగొట్టేసింది శ్రీవల్లి. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకునింది. కానీ టీజర్ లో ఎక్కడా కూడా బన్నీ నోట నుండి ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా వినిపించలేదు సుకుమార్. ఆ కారణంగా బన్నీ ఫాన్స్ డీప్ గా హర్ట్ అయ్యారు . బన్నీ బర్త్డ డే సందర్భంగా ఏదో ఊహించుకున్నామని టీజర్ అంటే ఇంకా హైప్స్ పెంచుకున్నామని ..

కానీ ఇంత చిన్న టీజర్ రిలీజ్ చేయడం సాటిస్ఫాక్షన్ గా లేదు అని ..పైగా ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా చెప్పనీకుండానే టీజర్ ని ఎండ్ చేసేసారు అంటూ బాధ పడిపోతున్నారు. బన్నీ ఫాన్స్ ఈ విషయంలో డీప్ గా హర్ట్ అయినట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . మరి బన్నీ ఫ్యాన్స్ ని సుకుమార్ ఎలా కూల్ చేస్తాడో చూద్దాం..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news