Moviesపుష్ప2 లో అల్లు అర్జున్ కట్టుకున్న ఈ చీర ఎవరిదో తెలుసా..?...

పుష్ప2 లో అల్లు అర్జున్ కట్టుకున్న ఈ చీర ఎవరిదో తెలుసా..? సుకుమార్ అలా సెంటిమెంట్ ని ఫాలో అయ్యాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అభిమానులు ఈ సినిమా విషయంలో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా కోసం బన్నీ 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

కెరియర్ లోనే ఫస్ట్ టైం ఈ విధంగా ఆయన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నిన్న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ . స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టీజర్ అదిరిపోయింది . చీరకట్టులో బన్నీ విజృంభించేశాడు . గంగమ్మ జాతర ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా మారబోతుంది అంటూ టీజర్ తోనే హింట్ ఇచ్చేశాడు సుకుమార్ .

ఈ సినిమాలో అల్లు అర్జున్ చీర కట్టుకొని అమ్మవారి గెటప్ లో కనిపించబోతున్నాడు . ఈ సినిమాలో అల్లు అర్జున్ కట్టుకున్న ఈ చీరకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాలో కట్టుకున్న చీర మరి ఎవరిదో కాదు వాళ్ళ తల్లిది . సెంటిమెంట్ గా ఉంటుంది అంటూ సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట . ఈ సినిమాకి ఈ ఫైట్ సీన్ హైలెట్ గా ఉండబోతుంది అంటున్నారు జనాలు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఈ ఫైట్ సీన్ ఇంటర్వెల్లో రాబోతుందట . ఆ తర్వాతే పుష్ప రాజ్ గాడి రూలింగ్ స్టార్ట్ కాబోతుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news