Moviesఅల్లు అర్జున్ VS రామ్ చరణ్ : మెగాస్టార్ తర్వాత...

అల్లు అర్జున్ VS రామ్ చరణ్ : మెగాస్టార్ తర్వాత ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే గట్స్ ఉన్న హీరో ఎవరు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు చిరంజీవి . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా మారి తనకంటూ హ్యూజ్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుని తన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి పది మంది వచ్చేలా మార్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు అంటే కారణం మాత్రం ఆయన టాలెంట్ అనే చెప్పాలి .

అయితే మెగాస్టార్ తర్వాత ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే హీరో ఎవరు అన్న విషయం బాగా వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా నిన్న బన్నీ బర్త డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప2 సినిమా టీజర్ చూసిన తర్వాత జనాలు మెగాస్టార్ ప్లేస్ ను రీప్లేస్ చేసేది కచ్చితంగా అల్లు అర్జున్ అంటూ పొగిడేస్తున్నారు . సినిమా కోసం ఎంత కష్టం అయినా భరిస్తాడు అల్లు అర్జున్ అని.. అల్లు అర్జున్ చీర కట్టుకున్నట్లు రామ్ చరణ్ చీర కట్టుకొని నటించడం జన్మలో జరగని పని అని ..

మెగాస్టార్ తర్వాత ఆస్థానాన్ని అందుకునే ఘట్స్ క్యాప్యాబలిటి అన్ని కూడా అల్లు అర్జున్ కే ఉన్నాయి అంటూ పొగిడేస్తున్నారు. మరోపక్క రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగాస్టార్ తర్వాత అటువంటి స్థాయి అందుకునే హక్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉంది అంటూ వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news