నందమూరి ఫ్యాన్స్ దేవర సినిమా అప్డేట్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో మనకు తెలిసిందే. రీసెంట్గా సూపర్ డూపర్ హిట్గా నిలిచిన టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. స్టేజ్ పైకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో మాట్లాడి అభిమానులను ఫిదా చేశారు . జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఆయన మాట్లాడుతూ..” అభిమానులకు నమస్కారాలు .. నేను సిద్ధూ జొన్నల గడ్డ నటించిన సినిమాలు చాలానే చూశాను . కానీ ఆయనతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ కరోనా తర్వాతే వచ్చింది. సినిమా అంటే ఒక పిచ్చిగా ఉంటే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో సినిమాలో ఆయన పర్ఫామెన్స్ చూస్తేనే అర్థమవుతుంది ” అంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాదు తనదైన స్టైల్ లో డైలాగ్స్ చెప్తూ.. “అది కుదిరితే సరిదిద్దండి.. లేదంటే క్షమించండి అంతేకానీ నేను ఉన్నాను అని గుర్తించండి” అంటూ అత్తారింటికి దారేది స్టైల్లో ఓ డైలాగ్ చెప్పారు .అంతేకాదు ఐయామ్ టెల్లింగ్ దట్ అంటూ నవ్వులు పూయించారు . అనంతరం పోలే అదిరిపోలే అంటూ త్రివిక్రమ్ ని కూడా నవ్వించేసాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది . అయితే ఇవి దేవర సినిమాలో డైలాగ్స్ గా వాడుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఇంత ఎనర్సిటీగా మాట్లాడిన స్పీచ్ కి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి..!!