అల్లు అర్జున్ ..త్వరలోనే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోబోతున్న హీరో . టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయబోతున్న ఓన్లీ స్టార్ .. రీసెంట్గా అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా టీజర్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా చాలా కష్టపడుతున్నాడు . ఎంతలా అంటే ఆయన ఎప్పుడూ చేయని పనులు కూడా చేస్తున్నాడు . ఈ సినిమాలో అల్లు అర్జున్ చీర కట్టుకొని అమ్మవారి గెటప్ లో కనిపించబోతున్నాడు .
దీనికి సంబంధించిన లుక్ ఎప్పుడో రిలీజ్ అయింది . కాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లో అల్లు అర్జున్ చీరకట్టులో ఫైట్ చేయడం టీజర్ కి హైలెట్గా మారింది. ఈ సినిమా మొత్తానికి గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ హైలేట్ గా మారబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ క్రమంలోనే చీరకట్టి ఫైట్ చేయడానికి అల్లు అర్జున్ ఎన్ని టెక్స్ తీసుకున్నాడు..? అన్న విషయం వైరల్ గా మారింది .
అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ చీరకట్టులో ఫైట్ సీన్స్ కు చాలా చాలా కష్టపడ్డారట . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 51 టేకులు తీసుకున్నట్లు సమాచారం అందుతుంది . అల్లు అర్జున్ డెడికేషన్ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు .. మిగతా హీరో అసలు చీర కట్టడానికే ఇంట్రెస్ట్ చూపించరు .. అలాంటిది పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకున్నాక చీర కట్టుకున్న అల్లు అర్జున్ అలాంటి ఫైట్ చేయడం కోసం 51 టేకులు తీసుకొని మరి జనాలను మెప్పించబోతున్నాడు అంటే ఆయన డెడికేషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి అనిప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మొత్తానికి పుష్ప2 సినిమాతో సినీ చరిత్రను మరోసారి తిరగరాయబోతున్నాడు అల్లు అర్జున్ అన్న విషయం క్లారిటీకి వచ్చేసింది . కేవలం కొద్ది నెలలు అంటే కొద్ది నెలల్లోనే ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. చూద్దాం, పుష్ప గాడి రూలింగ్ ఏ రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేస్తుందో..??