సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాని షేక్ చేసేస్తూ ఉంటాయి. రీసెంట్గా తన బర్త్డ డే ను గ్రాండ్గా జరుపుకున్న బన్నీ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది . అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .
ఈ విషయం మనందరికీ తెలిసిందే . అయితే అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి కంటే ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు . ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు . ఈ విషయం స్వయాన ఆయన ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టడం గమనార్హం. అల్లు అర్జున్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” తన ఫస్ట్ లవర్ పేరు శృతి అంటూ బయట పెట్టాడు. అయితే ఆమెతో ఎందుకు విడిపోవాల్సిన వచ్చింది అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు . ఆ తర్వాత స్నేహ రెడ్డిని మొదటి చూపులోనే చూసి లవ్ చేసాడట “..
“బన్నీ రియల్ లైఫ్ శ్రీవల్లి ఆమె అంటూ ఫిక్స్ అయిపోయాడట . ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కన్నారు. ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు . త్వరలోనే రిలీజ్ కాబోతున్న పుష్ప2తో గ్లోబల్ స్థాయిలో రికార్డ్స్ బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యాడు. స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది. తనదైన స్టైల్ లో భర్తకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది . ఈ జంట ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటూ బ్లెస్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు”..!!