Moviesరామ్ చరణ్ ఒంటి పై ఉన్న ఏకైక టాటూ అదే.. దాని...

రామ్ చరణ్ ఒంటి పై ఉన్న ఏకైక టాటూ అదే.. దాని అర్థం ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ ఎక్కువగా టాటూస్ వేయించుకుంటున్నారు . మరీ ముఖ్యంగా హీరో టాటూస్ వేయించుకోవడం మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. నాగార్జున మాత్రం శివమణి సినిమా టైంలో భుజానికి ఒక టాటూ వేయించుకున్నాడు .. ఆ తర్వాత హీరోస్ చాలా చాలా తక్కువ మంది మాత్రమే టాటూస్ జోలికి వెళ్తూ ఉంటారు .

రీసెంట్గా రాంచరణ్ టాటూ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి మెగాస్టార్ చిరంజీవికి ఇలాంటి టాటూస్ అంటే పడదు . అందుకే రామ్ చరణ్ మొదటి నుంచి దూరంగా ఉంటాడు . కానీ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ క్లింకార పుట్టిన తర్వాత ఉపాసన-క్లీంకార పేర్లు కలిసి వచ్చేలా ..కేయూసి..అంటూ ఒక టాటూ వేయించుకున్నాడట .

అయితే అది ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా తన ఛాతిపై వేయించుకున్నాడట . ఈ విషయం ఆలస్యంగా బయటపడింది . దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు. రామ్ చరణ్ కి ఫ్యామిలీ అంటే ఇంత ఇష్టమా ..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రెసెంట్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ తర్వాత లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అంటున్నారు. సుకుమార్ తో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . చూద్దాం చరణ్ లైఫ్ ఎలా టర్న్ అవ్వబోతుంది అనేది..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news