పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ – అల్లు అర్జున్ కి సంబంధించిన ఏదో ఒక వార్త ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతూనే ఉంది . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ .. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు . వీళ్లిద్దరి దగ్గర నుంచి ఏ సినిమా అప్డేట్ వచ్చినా సరే సెకండ్స్ లోనే జెడ్ స్పీడ్ లో నెట్టింట ఈ వార్త ట్రెండ్ అవుతుంది.
ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . అలాగే రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ చేంజర్ సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకున్నాడు. ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే.. రామ్ చరణ్ కి బన్నిని చూస్తే ఈర్ష్య కలుగుతుంది అనే వార్త వైరల్ గా మారింది .
ఎవరైనా సరే ఆయన మొహం ముందు ..ఆయన ను విమర్శించిన కూడా దాన్ని చాలా లైట్ గా తీసుకొని .. తన పనిలో తన నిమగ్నం అయిపోతాడట . అలా ఉండడం చాలా కష్టం .. ఎవరైనా ఏదైనా అంటే ప్రతి ఒక్కరు చాలా బాధపడతారు . దానివల్ల మనకి వచ్చేది ఏమీ ఉండదు . ఇంకా మనమే చాలా ఫిజికల్ గా మెంటల్‌గా స్ట్రెస్ కి గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ విషయం కారణంగా రామ్ చరణ్ ఎప్పుడు అల్లు అర్జున్ ని చూసి ఈర్ష్య పడతారట . అల్లు అర్జున్ ఎలా అంత లైట్ గా ప్రతి విషయాన్ని తీసుకోగలరు అంటూ ఇంటర్వ్యూలో పరోక్షంగా బయటపెట్టిన మేటర్ ఇప్పుడు సంచలనంగా మారింది..!!