Moviesఆ హీరోయిన్ బయోపిక్ లో మృణాల్ ఠాకూర్.. జాక్ పాట్ ఛాన్స్...

ఆ హీరోయిన్ బయోపిక్ లో మృణాల్ ఠాకూర్.. జాక్ పాట్ ఛాన్స్ కొట్టింది రోయ్..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో బయోపిక్ లో ట్రెండ్ బాగా కొనసాగుతుంది . మరి ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ కి సంబంధించిన బయోపిక్లను ఒక్కొక్కటిగా తెరపై చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డైరెక్టర్ లు. కాగా చాలా సంవత్సరాలుగా హీరోయిన్ సౌందర్య బయోపిక్ తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది . కానీ ఏ డైరెక్టర్ కూడా అందుకు సాహసం చేయడం లేదు . అయితే త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న కృష్ణవంశీ హీరోయిన్ సౌందర్య బయోపిక్ తెరకెక్కించబోతున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.

ఫైనల్లీ ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఇన్నాళ్లు ఈ సినిమాలో హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను అనుకున్నారట. కానీ ఆమె కాకుండా ఈ ప్రాజెక్టులో ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ టెన్షన్ మృణాల్ ఠాకూర్ ని తీసుకోవాలి అంటూ ఫిక్స్ అయ్యారట. ఒకవేళ ఇది నిజంగా నిజమైతే మాత్రం మృణాల్ ఠాకూర్ కెరియర్ సెటిల్ అయిపోయినట్లే .

సీతారామం సినిమాతో వచ్చిన క్రేజ్ తో అవకాశాలు ఓ రేంజ్ లో పట్టేసుకుని దున్నేస్తున్న మృణాల్ .. సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్ బయోపిక్ లో నటిస్తే ఖచ్చితంగా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది . తద్వారా మృణాల్ కి కూడా మంచి పేరు పబ్లిసిటీ వస్తుంది అంటున్నారు జనాలు. ప్రజెంట్ మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ సినిమా షూట్ లో బిజీగా ఉంది . అంతేకాదు త్వరలోనే ప్రభాస్ సరసన కల్కి సినిమా షూట్ లో కూడా బిజీ కాబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news