Moviesరామ్ చరణ్ సినిమాలో జాన్విను హీరోయిన్గా చూస్ చేసింది ఎవరో తెలిస్తే...

రామ్ చరణ్ సినిమాలో జాన్విను హీరోయిన్గా చూస్ చేసింది ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది.. అసలు ఊహించలేరు..!!

ప్రజెంట్ ఇప్పుడు అందరి కళ్ళు బాలీవుడ్ ముద్దుగా జాన్వి కపూర్ పైనే పడ్డాయి . అమ్మడి అదృష్టమో.. లేకపోతే టాలెంటో తెలియదు కానీ అందరూ బడా హీరోల సినిమాలలోనే నటించే ఛాన్సెస్ కొట్టేస్తుంది . అసలు ఎవరు ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవర సినిమా ద్వారా తెలుగులో డేబ్యూ ఇచ్చే ఛాన్స్ అందుకుంది . ఈ విషయం అభిమానులకు సైతం షాకింగ్ గా ఉంది .

ఎన్టీఆర్ పక్కన నటించడానికి హాలీవుడ్ బ్యూటీలు సైతం కాంపిటీషన్ పడుతున్నారు . మరి అలాంటిది ఆ ఛాన్స్ జాన్వి కపూర్ కి ఎలా వచ్చిందా..? అన్నది ఇప్పటికీ అందరికీ మిలియన్ల డాలర్ల ప్రశ్న . ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరొక పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ సినిమాలో అవకాశం అందుకుంది . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించే సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది .

దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది . రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ జాన్వికపూర్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకోవడానికి కారణం ఎవరు అంటూ విపరీతమైన చర్చ జరుగుతుంది. దేవర సినిమా రావడానికి కారణం బోనీ కపూర్ కారణం అయితే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చరణ్ ఆఫర్ అందుకోవడానికి కారణం మాత్రం చిరంజీవి అంటూ ప్రచారం జరుగుతుంది .

ఈ సినిమాలో ముందుగా రవీనా టందనా కూతుర్ని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నారట . కానీ లాస్ట్ మూమెంట్లో చిరంజీవి – శ్రీదేవి పై ఉన్న అభిమానంతో ఈ సినిమాలో శ్రీదేవి కూతురైతే బాగుంటుంది ..ఆమెకు ఇండస్ట్రీలో మనం హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాము అంటూ బుచ్చిబాబు సనాకు స్పెషల్ రిక్వెస్ట్ మీద ఈ పేరుని సజెస్ట్ చేశారట . ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.

చిరంజీవి లాంటి స్టార్ హీరో జాన్వి కపూర్ లాంటి హీరోయిన్ ని చరణ్ సినిమాలో చూస్ చేసుకోవడం అందరికీ షాకింగ్ గా ఉంది. చరణ్ రేంజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ఉంది . హాలీవుడ్ బ్యూటీ గ్లోబల్ బ్యూటీస్ తో నటించే సత్తా ఉంది . మరి అలాంటి ఆయన జాన్వి ని కేవలం శ్రీదేవి కోసం మాత్రమే చూస్ చేసుకోవడం ఇప్పుడు అభిమానులకి కొత్త డౌట్లు పుట్టిస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news