సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా ఒకే ఒక్కటి రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండల మధ్య లవ్ స్టోరీ . వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కలెక్షన్స్ పరంగా అటు ఇటుగా ఉన్నా కూడా టాక్ ప్రకారం కెమిస్ట్రీ ప్రకారం మాత్రం ఎంతలా హీట్ అయ్యాయో వీళ్ళ సినిమాలు మనకు తెలిసిందే . వీళ్ళ కాంబో అంటే పడి చచ్చిపోతారు జనాలు.
కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో వీళ్లకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది . రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నారు అని చెప్పడానికి పరోక్షంగా ఒక ఎగ్జాంపుల్ ని రిలీజ్ చేశారు . రీసెంట్గా విజయ్ దేవరకొండ తలకు పింక్ కలర్ క్యాప్ ను ధరించి కనిపించాడు. అయితే అదే పింక్ కలర్ రష్మిక మందన్నా.. ధరించి ఉమెన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా పోస్ట్ చేసింది .
“మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు.. ఆడపిల్లలుగా పుట్టాలి అంటే అదృష్టం ఉండాలి “అంటూ తనదైన స్టైల్ లో పోస్ట్ చేసింది . ఆమె చేసిన పోస్ట్ మర్చిపోయిన జనాలు.. ఆమె తలకు ఉన్న పింక్ క్యాప్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు . మొన్న విజయ్ పెట్టుకున్న క్యాప్ ఇదే కదా .. ఇప్పుడు నువ్వు కూడా ఇదే పెట్టుకున్నావు .. ఎందుకు మీరు ఈ దోబూచ్లాట ఆడుతున్నారు. ప్రేమ ఉంది అని ఒప్పుకోవచ్చు కదా అంటున్నారు . మరికొందరు ఓరి మీ అభిమానం తగలెయ్య ఇలా తయారయ్యారేంటి ..అసలు విజయ్ దేవరకొండ పెట్టుకున్న క్యాప్ వేరే ఆమె పెట్టుకున్న క్యాప్ వేరే.. ప్రపంచంలో పింక్ క్యాప్ లు మరి ఉండవా..? అంటూ వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!