Movies"ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాలో అలా చేస్తే మీరు ఒప్పుకుంటారా..?".. అడిగి...

“ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాలో అలా చేస్తే మీరు ఒప్పుకుంటారా..?”.. అడిగి కడిగి పడేసిన వరుణ్ తేజ్.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ తాజాగా నటించిన సినిమా “ఆపరేషన్ వాలెంటైన్”. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు . మార్చి ఒకటవ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కాబోతుంది . రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్ .

ఈ క్రమంలోనే రీసెంట్గా మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడిన వరుణ్ తేజ్ పలువురు రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు అద్భుతమైన ఆన్సర్ ఇచ్చి.. శభాష్ అనిపించుకున్నాడు . ఈ క్రమంలోనే రిపోర్టర్ అడిగిన ప్రశ్న కు వరుణ్ ఇచ్చిన ఆన్సర్ వైరల్ గా మారింది . పవన్ సినిమాలో మీరు విలన్ గా చేస్తారా ..? అన్న ప్రశ్నకు ..”చచ్చిన అలా చేయను .. అలా చేస్తే చంపేస్తారు ఫ్యాన్స్..” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.

అంతేకాదు కంచె మూవీ కి మించిన ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి అని తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చాడు . అంతేకాదు మరొక రిపోర్టర్ వచ్చి “ధ్రువ సినిమాకి సీక్వెల్ రాబోతుందా ..? ఆ సినిమాలో మీరు ఏమన్నా నటిస్తారా..? అన్న ప్రశ్నకు ధ్రువ సిక్వెల్లో నేనెందుకు నటిస్తాను..? చరణ్ అన్నయ్య నే చేయొచ్చు అంటూ మాస్ ఆన్సర్ ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు . ప్రజెంట్ వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news