Movies"మెగా హీరోలు అంతా అలాంటి వాళ్లే".. నవదీప్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

“మెగా హీరోలు అంతా అలాంటి వాళ్లే”.. నవదీప్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది మెగా హీరోలు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో సగానికి పైగా వాళ్లే ఉన్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో మెగా హీరోలపై నవదీప్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాలో నవదీప్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నవదీప్ మాట్లాడుతూ మెగా హీరోలపై సంచలన కామెంట్స్ చేశారు.

నవదీప్ మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో ఉండే మెగా హీరోలు అందరూ ట్రెండ్ సెట్ చేసిన వారే అని .. ఒక్కొక్కరికి ఒక్కొక్క రికార్డు ఉంది అని .. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని..ఇండస్ట్రీ కి పెద్ద దిక్కు అని.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందేనని ..గ్లోబల్ స్ధాయిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుర్తింపు సంపాదించుకున్నాడు అని ..సాయిధరమ్ తేజ్ – వరుణ్ తేజ్ – వైష్ణవ్ తేజ్ అందరూ కూడా ఇండస్ట్రీలో భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు అని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేశారు” అని చెప్పుకు వచ్చాడు.

“సౌత్ ఇండియాలో బన్నీ మొట్టమొదట సిక్స్ ప్యాక్ చేశారు అని” ఆయన ఈ సందర్భంగా చెప్పడం నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు మెగా ఫ్యామిలీ రాడర్లు అభిమానులు అంతా ఉండగా ఏమీ కాదు అని నవదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. మెగా ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడంతో నవదీప్ త్వరలోనే మెగా ఫ్యామిలీ నుంచి భారీ భారీ అవకాశాలు అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ పలువురు జనాలు వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news