Moviesఇండస్ట్రీలో మరో వికెట్ డౌన్..పెళ్లి పీటలు ఎక్కబోతున్న పవన్ ఫేవరేట్ హీరోయిన్..!

ఇండస్ట్రీలో మరో వికెట్ డౌన్..పెళ్లి పీటలు ఎక్కబోతున్న పవన్ ఫేవరేట్ హీరోయిన్..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్ లిస్ట్ ఎక్కువ అయిపోతుంది. కొందరు అతి చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం వయసు మీరిపోయిన తర్వాత ఏదో చేసుకోవాలి కదా అన్న సాంప్రదాయ బద్దంగా చూసుకుంటున్నారు. అయితే రీసెంట్గా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలేకబోతున్న విషయం తెలిసిందే.

తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆమె పెళ్లి పనుల్లో బిజీగా ఉంది . దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . రీసెంట్గా మరో న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . ఇండస్ట్రీలో మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోబోతుంది అన్న ప్రచారం ఊపొందుకుంది. ఆమె మరి ఎవరో కాదు నివేదా థామస్ . తనదైన స్టైల్ లో నటించి తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నివేదా థామస్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

గత కొంతకాలంగా ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . కేవలం ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తుంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా అరాకొరా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే నివేదా థామస్ పేరెంట్స్ ఆమెకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఆమె పెళ్లి చేసుకోబోయేది కూడా సొంత బావని అంటూ తెలుస్తుంది . నివేదా థామస్ అంటే ఇండస్ట్రీలో చాలామందికి ఇష్టం మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ఆమె ఫేవరెట్ హీరోయిన్ . ఈ విషయాన్ని ఆయనే ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు . పవన్ కళ్యాణ్ తో ఆమె వకీల్ సాబ్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది . ప్రెసెంట్ నివేదా థామస్ పెళ్లి వార్త వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news