Movies'అమ్మ నా బూతులు ' తిడుతున్న ..త్రివిక్రమ్ 'కుక్కిన పేనులా' ఉండటానికి...

‘అమ్మ నా బూతులు ‘ తిడుతున్న ..త్రివిక్రమ్ ‘కుక్కిన పేనులా’ ఉండటానికి కారణం ఏంటొ తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ని కావాలనే కొందరు టార్గెట్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారా..? అంటే ఎస్అన్న సమాధానమే వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరుని ఎంత దారుణంగా బూతులతో ట్రోల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం . గుంటూరు కారం సినిమా విషయంలో అయితే మరీ దారుణంగా బిహేవ్ చేశారు . అసలు ఆయన వేస్ట్ అని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోవడమే బెస్ట్ అంటూ పచ్చి ఘాటుగా ట్రోల్ చేశారు . అయినా సరే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు . కనీసం రివర్స్ కౌంటర్ కూడా ఇవ్వలేదు. రీసెంట్ గా హీరోయిన్ పూనం కౌర్ త్రివిక్రమ్ పై ఎలాంటి సంచలన కామెంట్స్ చేసిందో మనం చూసాం .

గతంలో త్రివిక్రమ్ తో ఉన్న విభేదాల కారణంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది అని అంతా అనుకుంటున్నారు . జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “జగన్ కు నేను కౌంటర్ ఇవ్వనని ..అసలు అలా పంచ్ డైలాగ్స్ చెప్పడం నాకు ఇష్టం లేదని అత్తారింటికి దారేది సినిమాలో కూడా సింహం గడ్డం పంచ్ డైలాగ్ త్రివిక్రమ్ నా చేత ఎలాగోలా చెప్పించేసారు” అని చెప్పుకొచ్చాడు. ఇదే వీడియోని ఓ మీడియా సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది . దానికి కౌంటర్ వేస్తూ పూనం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరుని ట్యాగ్ చేస్తూ “పనికిమాలిన వాడు ” అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది .

అయితే ఎప్పుడూ కూడా పరోక్షంగా స్పందించే పూనం .. ఈ విధంగా త్రివిక్రమ్ డైరెక్టుగా టార్గెట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దీనిపై కూడా ఏ విధంగా స్పందించలేదు . దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు . ప్రెసెంట్ ఇండస్ట్రీ ఎలా ఉందో మనకు తెలిసిందే. ఒక మాట అంటే వెంటనే కౌంటర్స్ ఇస్తున్నారు . మరి అలాంటిది త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సైలెంట్ గా ఉండడం ఏంటి అంటూ అందరూ షాక్ అయిపోతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ కోసమే ఆయన అన్ని విషయాల్లో సైలెంట్ గా ఉన్నారు అని .. ఇప్పుడు త్రివిక్రమ్ ఏం మాట్లాడినా సరే.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ధీరిని లాగుతూ ఆయనను ట్రోల్ చేస్తారు అని మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉండగా .. ఇలా మాట్లాడటం సరైన పద్ధతి కాదు అని నిపుణులు హెచ్చరించడం ద్వారానే త్రివిక్రమ్ సైలెంట్ అయిపోయారట . అందుకే కుక్కిన పెనులా పడున్నాడు.. అంటూ మరోసారి ట్రోల్ చేస్తున్నారు జనాలు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news