ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ పేరే మారుమ్రోగిపోతుంది . ఇండస్ట్రీలోకి వచ్చిన వరుణ్ తేజ్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు . రీసెంట్గా ఆయన నటించిన సినిమా “ఆపరేషన్ వాలంటైన్”.. మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాకు వీలైనంత పబ్లిసిటీ తీసుకొస్తున్నాడు వరుణ్ తేజ్.
ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత రిలీజ్ కాబోతున్న ఫస్ట్ సినిమా కావడంతో ఏ ఇంటర్వ్యూ కి వెళ్లిన లావణ్య త్రిపాఠి తో ప్రేమ ఎలా మొదలైంది ..? లావణ్య త్రిపాఠి ..వరుణ్ తేజ్ రిలేషన్షిప్ గురించి ఎక్కువగా ప్రశ్నలు వినపడుతున్నాయి . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ ప్రశ్నిస్తూ ..”లావణ్యతో సినిమాల్లో కలిసి నటించే అవకాశం వస్తే ఎస్ చెప్తారా ..? నో చెప్తారా..? అంటూ అడగ్గా వరుణ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు .
“స్టోరీకి మేము సెట్ అయితే కచ్చితంగా నటిస్తాము.. ఏదో చేయాలి అని తొందరపడి చేసేయము.. డైరెక్టర్ రాసుకున్న కథకు మేము సరిపోతేనే చేస్తాం ” అంటూ ఆన్సర్ ఇచ్చాడు . అంతే కాదు “మీరు చేసిన సినిమాల్లో లావణ్య కు ఏ సినిమా అంటే ఇష్టమని ప్రశ్నించగా ..?”..”ఇప్పటివరకు నేను ఆ ప్రశ్న ఆమెను అడగనేలేదు ” అంటూ సరదాగా బదులు ఇచ్చాడు. దీంతో వరుణ్ లావణ్య కు సంబంధించిన విషయాలు వైరల్ గా మారాయి..!!