అనసూయ – రష్మి .. ఇద్దరికి ఇద్దరే ..ఏమాత్రం తీసేయలేం.. ఇద్దరు కూడా టాప్ యాంకర్స్ . ఇద్దరు కూడా అందాలను ఎక్స్ పోజ్ చేస్తారు . ఇద్దరు కూడా తమదైన స్టైల్ లో హోస్ట్ చేస్తూ షోస్ కి మంచి టీఆర్పీస్ తీసుకొస్తారు. కాగా ప్రెసెంట్ అనసూయ హోస్ట్ రోల్ నుంచి తప్పుకొని సినిమాలో పలు కీలకపాత్రను పోషిస్తుంది . రష్మి మాత్రం ఇంకా జబర్దస్త్ ని హోస్ట్ చేస్తూనే ఉంది. కాగా మనందరికీ తెలిసిందే అనసూయ కానీ రష్మీ కానీ బాగా పాపులారిటి దక్కించుకోవడానికి కారణం జబర్దస్త్ షో .
ఈ షో పుణ్యమా అంటూ వీళ్లిద్దరూ స్టార్ యాంకర్లుగా మారిపోయారు . అయితే మొదట జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పుడు అనసూయ 12 ఎపిసోడ్లకు యాంకర్ గా వ్యవహరించింది. ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఆమె తప్పుకుంది . ఆ మూమెంట్లో అప్పుడప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మీను హోస్ట్ గా నియమించాలి అని నిర్ణయించుకుంది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ . ఇదే విషయాన్ని ఆమెకు చెప్పింది . అయితే ఆమె మాత్రం నాకు తెలుగు రాదు అంటూ ఓపెన్ గా చెప్పేసింది . పర్లేదమ్మా మేము చూసుకుంటాం మేనేజ్ చేస్తామంటూ హామీ ఇచ్చి జబర్దస్త్ షో కి హోస్టుగా తీసుకొచ్చారు రష్మీని.
అయితే 13వ ఎపిసోడ్ కి ఆమె హోస్ట్ చేస్తున్నప్పుడు అనసూయ అభిమానులు ఆమెను రేంజ్ లో ట్రోల్ చేశారు . నీ ముఖానికి తెలుగు రాదు ..నువ్వేంటి యాంకర్ అంటూ దారుణాతి దారుణంగా మాట్లాడారు. ఇవేంటి ఇంకా హద్దులు మీరి పోయి బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా చేశారు . వెక్కి వెక్కి ఏడ్చింది. ఇవి తట్టుకోలేకపోయింది రష్మీ. ఇదే విషయాలను మేనేజ్మెంట్ కి చెప్పింది. అయినా సరే మేనేజ్మెంట్ స్టార్టింగ్ లో ఇదంతా కామన్ అంటూ కొట్టి పడేశారు . ఆ తర్వాత మెల్ల మెల్లగా రష్మి తెలుగు నేర్చుకొని అభిమానుల్ని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది . ఒకానొక టైం లో మాకు అనసూయ వద్దు రష్మినే కావాలి అంటూ జనాలు కోరుకునే స్థాయికి ఎదిగిపోయింది. అలా వచ్చిరాని తెలుగుతో మేనేజ్ చేసి ఇప్పుడు టాప్ యాంకర్లలో ఒకరుగా ఉంది రష్మీ. అయితే రష్మీ అప్పట్లో ఎదుర్కొన్న ట్రోలింగ్ మాత్రం ఆమె ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది..!!