Moviesవాట్.. మన బాలయ్య పెళ్ళి జరిగింది ఆ స్పెషల్ ప్లేస్ లోనా..?...

వాట్.. మన బాలయ్య పెళ్ళి జరిగింది ఆ స్పెషల్ ప్లేస్ లోనా..? వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోలకి కూడా చెమటలు పట్టించే రేంజ్ లో ఆయన తన సినిమాలను చూస్ చేసుకుంటున్నాడు . ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్ లను తన ఖాతాలో వేసుకుని నందమూరి బిడ్డ అంటే ఇదే అని ప్రూవ్ చేసుకున్న బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు .

రాజకీయాలలో బిజీగా ఉన్న కారణంగా ఆ సినిమాను హోల్డ్ లో పెట్టి ప్రెసెంట్ పాలిటిక్స్ పనుల్లో బిజీగా మారిపోయారు . రీసెంట్ గా బాలయ్య వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య పెళ్లికి సంబంధించిన ఈ పెళ్లి కార్డు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది . బాలయ్య వెడ్డింగ్ కార్డులో పెళ్లి ఎక్కడ జరిగింది .. ముహూర్తం ఎప్పుడు అనే విషయం క్లియర్ గా ఉంది.

తిరుపతిలో బాలయ్య వసుంధర దేవిల వివాహం జరిగింది . బుధవారం మధ్యాహ్నం ముహూర్తంలో ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి కార్డు ప్రజెంట్ నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు ఈ పెళ్లి కార్డు ని వసుంధర దేవి ఎంతో ఇష్టంగా డిజైన్ చేయించుకుందట . అప్పట్లో ఈ పెళ్లి కార్డు హైలెట్గా మారింది . వసుంధర దేవి తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త దేవరపల్లి సూర్య రావు . 1982 డిసెంబర్ 8న వసుంధర దేవి – బాలయ్య వివాహం తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది . ప్రజెంట్ వీళ్ళ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news