Movies"నా విషయంలో ప్రతి ఒక్కరికి అదే పెద్ద డౌట్".. కాంట్రవర్షియల్ మ్యాటర్...

“నా విషయంలో ప్రతి ఒక్కరికి అదే పెద్ద డౌట్”.. కాంట్రవర్షియల్ మ్యాటర్ పై నోరు విప్పిన సమంత..!!

సమంత .. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ . “ఏం మాయ చేసావే” అనే మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది . నాగచైతన్యను ప్రేమించిన తర్వాత తన లైఫ్ నే మారిపోయింది . అక్కినేని ఇంటికి కోడలుగా మారిన తర్వాత తన జాతకం తిరిగిపోయింది. విడాకులు తీసుకున్న తర్వాత అసలు ఆమె ఎటు పోతుందో ఏం చేస్తుందో ఎవరికి తెలియని అయోమయ స్థితి నెలకొంది.

విడాకుల తర్వాత సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైంది సమంత . ఇప్పుడిప్పుడే ఆ ట్రోలింగ్ బాధలనుంచి బయటపడి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధపడింది . రీసెంట్ గా హీరోయిన్ సమంత ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలపై మాట్లాడింది . ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ రంగస్థలం సినిమాలోని రామలక్ష్మి పాత్ర గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది .

“ఈ పాత్ర కోసం నన్ను ఎంపిక చేయడానికి మేకర్స్ చాలా భయపడ్డారు.. పల్లెటూరి అమ్మాయిగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని మేకర్స్ ఆందోళన చెందారు. ఈ క్యారెక్టర్ గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నారు. చాలామంది నా క్యారెక్టర్ పట్ల అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ పాత్ర చేస్తే కెరీర్ దెబ్బ పడిపోతుంది అంటూ కూడా నాకు సలహాలు ఇచ్చారు. అయితే సుకుమార్ ని నమ్మి నేను ఈ పాత్ర చేశాను . ఈ పాత్ర నా కెరియర్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోయింది. ఇందులో నేను నటించడం నా అదృష్టం అనుకుంటున్నాను “. రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎన్ని సెన్సేషనల్ రికార్డ్స్ బద్దలు కొట్టిందో మనందరికీ తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news