Moviesనాకు కాబోయే భర్త VD నే.. సంచలన ప్రకటన చేసిన హీరోయిన్...

నాకు కాబోయే భర్త VD నే.. సంచలన ప్రకటన చేసిన హీరోయిన్ రష్మిక మందన్నా..!

రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నేషనల్ క్రష్ గా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ఏలేస్తుంది. రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమాతో సూపర్ స్టార్ బోల్డ్ బ్యూటీగా మారిపోయింది . ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకునిందో మనం చూసాం. రష్మిక మందన్నా ప్రజెంట్ పుష్ప2 సినిమా సెట్స్ లో బిజీగా ఉంది .

అంతేకాదు తెలుగులో మరో మూడు ప్రాజెక్టుల్లో నటిస్తుంది . బాలీవుడ్ లో ఏకంగా నాలుగు ప్రాజెక్టుల్లో నటిస్తుంది. రీసెంట్గా రష్మిక మందన్నా తనకు కాబోయే భర్త VD అంటూ కన్ఫామ్ చేసేసింది . దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నాల మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అని సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు అదంతా లేదు అంటూ కొట్టి పడేస్తూ వచ్చారు రష్మిక – విజయ్ .

రీసెంట్గా రష్మిక తనకు కాబోయే భర్త వ్డ్ నే అంటూ ప్రకటించింది . రష్మిక మందాన ఢిల్లీ ఫ్యాన్స్ ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో ఒక పోస్ట్ దర్శనం ఇచ్చింది. సదరు పోస్టులో ఫ్యాన్స్ రష్మికకు కాబోయే భర్త VD ఉండాలి అని అంటే అర్థం . వెరీ డేరింగ్ అని ..రష్మిక ని క్వీన్ అని పిలుచుకుంటాం.. కాబట్టి అతడు మా కింగ్ అని పోస్ట్ పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ పోస్టుకి రష్మిక మందన్నా స్పందించింది . “అవును ఇది వాస్తవం” అంటూ కామెంట్ పెట్టింది . దీనితో పరోక్షకంగా విజయ్ దేవరకొండనే తనకు కాబోయే భర్త అని చెప్పేసింది రష్మిక అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news