Movies100 కోట్లు ఇచ్చిన సరే ప్రభాస్ తన సినిమాలో అలాంటి సీన్స్...

100 కోట్లు ఇచ్చిన సరే ప్రభాస్ తన సినిమాలో అలాంటి సీన్స్ చేయడు.. ఎందుకో తెలుసా..?

ప్రభాస్ ..ఆరడుగుల అందగాడు ..అమ్మాయిల కలల రాకుమారుడు.. పెళ్లి వయసు దాటిపోతున్న సరే పెళ్లి గురించి పట్టించుకోకుండా పారిపోతున్న ఓ నాటీ కుర్రాడు.. ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . మంచితనానికి మరో మారుపేరు అనే చెప్పాలి . ఒక్క నెగిటివ్ ట్రోలింగ్ లేకుండా ఇండస్ట్రీలో నెట్టుకు వస్తున్న టాప్ హీరో . కాగ ప్రభాస్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ ముందుకు వెళ్తున్నాడు .

త్వరలోనే హనురాఘవపూడి తో కూడా ఓ సినిమాకి కమిట్ అవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇది ఫుల్ టు ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట. ప్రజెంట్ ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ప్రభాస్ తన సినిమాల్లో కొన్ని సీన్స్ ఉండకూడదు అంటూ డైరెక్టర్ కి కండిషన్స్ పెడతాడట. తన సినిమాలో రేప్ సీన్స్ తను హద్దులు మీరీన రొమాంటిక్ సీన్స్ చేయను అంటూ డైరెక్టర్ కి ముందే చెప్పేస్తాడట .

కొన్ని కొన్ని సినిమాలలో కంటెంట్ డిమాండ్ చేస్తే హీరోలు లిప్ లాక్స్.. బెడ్ సీన్స్.. న్యూడ్ సీన్స్ చేయాల్సి వస్తుంది. అయితే ప్రభాస్ మాత్రం అలాంటి సీన్స్ ఏమన్నా ఉంటే ముందే చేయనని చెప్పేస్తాడట . అమ్మాయిలను అవమానించే అలాంటి సీన్స్ అసలు నా సినిమాలో వద్దనే వద్దు అంటూ తెగేసి మేకర్స్ కు క్లారిటీ గా చెప్పేస్తాడట. ప్రభాస్ కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news