Movies"ఇప్పటికి రాజమౌళి నా ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వలేదు"..తమన్నా సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

“ఇప్పటికి రాజమౌళి నా ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వలేదు”..తమన్నా సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

తమన్నా.. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకి ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. హ్యాపీ డేస్ మూవీ తో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 19 ఏళ్ళు అవుతున్నా సరే .. ఇంకా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ముందుకు వెళుతుంది. ఈ మధ్యకాలంలో బోల్డ్ సినిమాలను కూడా ఓకే చేస్తుంది తమన్నా. జీ కర్దా లో ఆమె పర్ఫార్మ్ చేసిన తీరు అభిమానులకు సైతం ఆశ్చర్యం కలుగజేసింది .

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా – రాజమౌళి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . రాజమౌళి దర్శకత్వంలో తమన్నా నటించిన సినిమా బాహుబలి . ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసింది . అయితే రాజమౌళి పై తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నయి.

“అవంతిక పాత్రకు నన్ను ఎంపిక చేయడానికి కారణం ఏంటి..?” అని రాజమౌళిని చాలాసార్లు అడిగిందట తమన్న. అయినా సరే ఆయన సమాధానమే చెప్పకుండా నవ్వుతూ వెళ్ళిపోయే వారట. ” ఈ విషయం ఇప్పటికే నాకు అర్థం కావడం లేదు అని .. అసలు నాలో ఏం చూసి ఆయన ఆ పాత్రకి సెలెక్ట్ చేశారు ..అనేది ఇప్పటికే నాకు ప్రశ్నార్థకంగానే ఉంది” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా . బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో అదరగొట్టేసింది తమన్నా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news