Moviesఓరి దేవుడోయ్..మొన్న ఎన్టీఆర్..ఇప్పుడు ఆ స్టార్ హీరో ..మరో జాక్ పాట్...

ఓరి దేవుడోయ్..మొన్న ఎన్టీఆర్..ఇప్పుడు ఆ స్టార్ హీరో ..మరో జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన జగతీ ఆంటీ..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది . ఈ మధ్యకాలంలో జగతి ఆంటీ సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనం చూసాం . గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా గుర్తింపు సంపాదించుకున్న జగతి ఆంటీ అలియాస్ జ్యోతి రాయి ప్రెసెంట్ సోషల్ మీడియాని తన అందచందాలతో షేక్ చేసేస్తుంది . గుప్పెడంత మనసు సీరియల్ లో అమ్మ పాత్రలో కనిపించి మెప్పించిన జగతి ఆంటీ బయట మాత్రం హాట్ ఫిగర్ ని మించిపోయే రేంజ్ లో అందాలను వలకబోస్తూ ఉంటుంది .

ఇప్పటికే ఆమె పలు సినిమాల్లో సిరీస్లో నటిస్తూ బిజీ బిజీగా ముందుకు వెళుతుంది. ఎన్టీఆర్ 31 సినిమాలో కూడా ఆమె నటించబోతుంది అంటూ ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. దీనికి సంబంధించి ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని కూడా షేర్ చేసింది . ఇప్పుడు మరో ఆఫర్ తన ఖాతాలో వేసుకుంది జగతి ఆంటీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న విశ్వంభర సినిమాలో జగతి ఆంటీ ఛాన్స్ కొట్టేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఇది హీరోయిన్ రోల్ కాకపోయినప్పటికీ సినిమాలో చాలా ప్రధానంగా ఆకర్షించే రోల్ అంటూ ప్రచారం జరుగుతుంది . మరి ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్రను చాలా కేర్ఫుల్ గా చాలా రియలిస్టిక్ గా రాసుకున్నాడట డైరెక్టర్ వశిష్ట . ఈ క్రమంలోనే చిరంజీవి సినిమాలో ఆఫర్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదని ఇక జగతి ఆంటీ దశతిరిగిపోయింది అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news