Moviesవామ్మో.. ఏంటి రకుల్ పెళ్ళిలో అంత పెద్ద తప్పు జరిగిందా..? సాంప్రదాయాని...

వామ్మో.. ఏంటి రకుల్ పెళ్ళిలో అంత పెద్ద తప్పు జరిగిందా..? సాంప్రదాయాని బ్రష్టుపట్టించారుగా..!

రకుల్ ప్రీత్ సింగ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్ గా రాజ్యమేలేసింది . ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది . ఆ తర్వాత కోలీవుడ్ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ నటించి తనదైన స్థాయిలో మెప్పించింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీని చెక్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానిని నేను ప్రేమిస్తున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది .

కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ జంట రీసెంట్గా గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. కొద్దిగా గంటల క్రితమే వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాహుల్ జాకీ పెళ్లి వేడుక ఐటిసి గ్రాండ్ గోవా రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియా పోర్చుగీస్ విలేజ్ స్టైల్ లో రిసార్ట్ను నిర్మించినట్లు తెలుస్తుంది . అంతేకాదు డిఫరెంట్ పద్ధతుల్లో ముచ్చటగా మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్ అంటూ తెలుస్తుంది .

ఈ క్రమంలోనే వీళ్ళ పెళ్లిలో పెద్ద తప్పు జరిగింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . జాకీ భగ్నాన్ని రకుల్ ని పెళ్లి చేసుకున్న తర్వాత రకుల్ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంది . అయితే వెంటనే జాకీ కూడా రకుల్ పాదాలకు నమస్కరిస్తూ ఆమె బ్లెస్సింగ్స్ తీసుకోవడం అందరికీ షాకింగ్ అనిపించింది . నిజానికి ఏ సాంప్రదాయంలోనూ భర్త – భార్య కాళ్లు పట్టుకోవడం అనేది జరగదు. మరి జాకి ఎలా అలా చేస్తాడు అంటూ జాకీ ఫాన్స్ మండిపడుతున్నారు. అయితే ఈ రోజుల్లో ఇదంతా కామన్ అని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఈక్వల్ అని చెప్పడానికే ఇలా చేసి ఉంటాడు జాకీ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాన్స్ ఆయన చేసిన పనిని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది పెద్ద తప్పు అని జనాలు మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news