Moviesమెగా అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై...

మెగా అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై ఓపెన్ అప్ అయిన ఉపాసన(వీడియో)..!!

ఉపాసన రెండోసారి గర్భం దాల్చిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన భార్యగా ఉపాసన కూడా అందరికీ సుపరిచితురాలు . అంతకుముందే అపోలో హాస్పిటల్స్ చైర్మన్ పర్సన్ ప్రతాప్ రెడ్డి మనవరాలుగా కూడా ఆమె బాధ్యతలు సక్రమంగా నెరవేర్చింది. ఇంతే కాకుండా జనాలకు అవసరమైన విషయాలను కూడా ఓపెన్ గా బోల్డ్ గా చెప్పుకొస్తూ ఉంటుంది .

రీసెంట్గా ఉపాసన క్లింకారాకు జన్మనిచ్చింది. పెళ్లయిన 11 ఏళ్లకు ..వాళ్లకు పాప జన్మించడంతో మెగా ఫాన్స్ ఉబ్బి తబ్బిపోయారు . గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తర్వాత ఉపాసన ఫ్యామిలీ చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతున్నారు . రీసెంట్గా ఈ జంట రెండో బిడ్డను కూడా వెల్కమ్ చెప్పబోతుంది అంటూ వార్తలు వినిపించాయి . దానిపై ఒక కార్యక్రమంలో పరోక్షంగా స్పందించింది ఉపాసన .

“జీవితంలో మీ నిర్ణయాలు చాలా స్ట్రాంగ్ గా తీసుకోవాలి ..మరి ముఖ్యంగా మహిళలు మీ నొప్పి మీకే తెలుస్తుంది.. ఎప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది మీ ఇష్టం.. నేను పిల్లలను ఆలస్యంగా కనాలి అనుకున్నాను ..అలాగే కన్నాను నా పక్కన మేడం కూడా అంతే .. మేము హ్యాపీగా ఉన్నాము. అంతేకాదు నేను ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా రెడీ గా ఉన్నాను ” అంటూ చెప్పుకు వచ్చింది . దీంతో చాలామంది ఉపాసన ప్రెగ్నెంట్ అని ఆ విషయాన్ని ఇలా పరోక్షంగా చెప్పింది అంటూ ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news