Moviesదేవర సినిమాతో బన్ని కి ఉన్న విడతీయ్యరాని సంబంధం ఏంటో తెలుసా.....

దేవర సినిమాతో బన్ని కి ఉన్న విడతీయ్యరాని సంబంధం ఏంటో తెలుసా.. అందుకే రిలీజ్ డేట్ ని అడ్డుకున్నాడా..?

జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులకు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొడుతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పుష్ప లాగా రెండు భాగాలుగా రాబోతుంది . చాలా కష్ట పడి తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ ఈ సినిమాని ఆయన పడుతున్న కష్టం ఆధారంగా తెలుస్తుంది.

అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది . కాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ కథను ముందుగా అల్లు అర్జున్ తో తెరకెక్కించాలనుకున్నారట . దానికి సంబంధించి గతంలో అఫీషియల్ ప్రకటన కూడా చేశారు.

అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట మన అల్లు అర్జున్ . కొన్ని సంవత్సరాలు బన్నీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించుకుని తిరిగారట. దీంతో ఆ కథను హోల్డ్ లో పెట్టి మార్పులు చేర్పులు చేసి అల్లు అర్జున్ తో తెరకెక్కించాల్సిన కథను ఎన్టీఆర్ కి చెప్పి ఒప్పించి ఫైనల్లి ఆయన కాల్ షీట్స్ తీసుకుని ..సినిమాకి కమిట్ అయ్యాడు కొరటాల. ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయిన హిట్ కొడితే ఎన్టీఆర్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుంది ..అప్పుడు అల్లు అర్జున్ మిస్ చేసుకున్న హిట్ సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news