Moviesవరుణ్ తో లవ్..అల్లు అరవింద్ ముందే పసిగట్టడంపై లావణ్య సంచలన కామెంట్స్.....

వరుణ్ తో లవ్..అల్లు అరవింద్ ముందే పసిగట్టడంపై లావణ్య సంచలన కామెంట్స్.. హీట్ పెంచేసిన మెగా కోడలి ఆన్సర్..!

లావణ్య త్రిపాఠి .. మొన్నటి వరకు ఒక యాక్ట్రెస్ గా .. ఒక మోడల్ గా .. ఒక హీరోయిన్ గా మాత్రమే తెలుసు . కానీ ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్గా బడా ఫ్యామిలీకి కోడలుగా తెలుసు . మెగా ఫ్యామిలీ ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి తన పేరుని మరింత స్థాయిలో మారుమ్రోగిపోయేలా చేసుకుంటుంది . రీసెంట్గా లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత ఫస్ట్ నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది .

ఈ సిరీస్ లో చాలా చక్కగా చాలా ట్రెడిషనల్ గా కనిపించింది . నటన పరంగా కూడా లావణ్య బాగా ఆకట్టుకునింది . ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ ను చేస్తుంది . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి కు హోస్ట్ నుంచి వింత ప్రశ్న ఎదురైంది . లావణ్య – వరుణ్ పెళ్లి అయిన మూమెంట్లో గతంలో అల్లు అరవింద్ .. లావణ్య కు “ఇక్కడే ఎవరైనా మంచి తెలుగు కుర్రాడిని చూసి సెటిలైపో “అంటూ సలహా ఇస్తారు .

ఆ విషయం అప్పట్లో బాగా ట్రెండ్ అయింది . ఎన్నో మీమ్‌స్ కూడా వచ్చాయి . అల్లు అర్జున్ కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. మా డాడీ విజనరీ అంటూ అల్లు అర్జున్ మీమ్‌స్ షేర్ చేస్తూ కామెంట్ కూడా పెట్టాడు. ఇదే ప్రశ్న హోస్ట్ లావణ్యను ప్రశ్నించగా ఆమె బదులిస్తూ..” ఆయన నిజంగానే విజినరీ నాకు తెలుసు.. కాకపోతే ఆయనకు తెలియని విషయాన్ని కూడా ఎలా అలా చెప్పారు అన్నది నాకు ఇప్పటికీ సర్ప్రైజ్ గానే ఫీల్ అవుతున్న.. ఏమో ఆయనకి ఎలా తెలుసో.. నాకైతే తెలియదు అంటూ నవ్వుతూ చెప్పేసింది “. లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news