Moviesజాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన కుమారి ఆంటీ.. 100 ఏళ్లకి సరిపడ...

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన కుమారి ఆంటీ.. 100 ఏళ్లకి సరిపడ లక్కి ఛాన్స్ ఇది..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది సామాన్య జనాలు కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వేలల్లోనే ఆ లిస్ట్ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు . అయితే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగిపోతున్న పేరు కుమారి ఆంటీ . హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఆమె స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకొని జీవనం కొనసాగిస్తుంది. ఆమె ఫుడ్ టెస్ట్ చాలా బాగుంటుంది అంటూ అందరూ మెచ్చుకుంటారు .

అంతేకాదు పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఆమె ఫుడ్ టెస్ట్ చేయడమే కాకుండా ఆమెను ఎంకరేజ్ కూడా చేస్తున్నారు . రీసెంట్గా కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్ చేయించడానికి చాలామంది ట్రై చేశారు . అయితే అది అంతా బెడిసి కొట్టింది . ఫైనల్లీ కుమారి ఆంటీ షాప్ ఓపెన్ అయింది . కాగా ప్రజెంట్ కుమారి ఆంటీ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కుమారి ఆంటీకు బంపర్ ఆఫర్స్ వస్తున్నాయట . పలువురు సినిమాల్లో అడుగుతూ ఉండగా మరికొందరు ఆమెను రియాలిటీ షోస్ కి తీసుకురావాలి అంటూ ట్రై చేస్తున్నారట .

అయితే వాటికి అన్నిటికి నో చెబుతుందట కుమారి ఆంటీ. తన కష్టాన్ని నమ్ముకుని బ్రతకడానికి సిద్ధంగా ఉందట . రీసెంట్గా సోషల్ మీడియాలో కుమారి ఆంటీ బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్లబోతుంది అన్న ప్రచారం జరుగుతుంది. మహిళగా వ్యాపారంలో రాణిస్తున్న కుమారి ఆంటీ కి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కుమారి ఆంటీ మాత్రం బిగ్ బాస్ లోకి వెళ్ళను అంటూ తెగేసి చెప్పేసిందట. తాను కష్టపడి ఫుడ్ బిజినెస్ చేసుకొని తన లైఫ్ని ముందుకు తీసుకెళ్తానే కానీ తనకు రాని పనిని తాను చేయను అని తెగేసి చెప్పేసిందట . కొందరు కుమారి ఆంటీ ని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళద్దు అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news