Movies"నా గురించి అలా రాసిన మీకు హ్యాట్సాఫ్".. ప్రముఖ వెబ్ సైట్...

“నా గురించి అలా రాసిన మీకు హ్యాట్సాఫ్”.. ప్రముఖ వెబ్ సైట్ కి అనుపమ ఘాటు కౌంటర్..!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్.. పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా టిల్లు స్క్వేర్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అభిమానులు ఓ రేంజ్ లో ఆవిడను ఆడేసుకుంటున్నారు. అంతవరకు చాలా పద్ధతిగా కనిపించిన అనుపమ పరమేశ్వరణ్.. సినిమాలో మాత్రం బీభత్సంగా అందాలను ఎక్స్ పోజ్ చేసింది .

అసలే దీనికి సంబంధించి ఆమె హ్యూజ్ ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటున్న మూమెంట్లో ప్రముఖ వెబ్సైట్ ఆమెకు సంబంధించిన ఓ వార్త రాయడంతో ఫుల్ ఫైర్ అయిపోయింది . సోషల్ మీడియా వేదికగా ఇచ్చి పడేసింది . “సైరన్” మూవీలో అనుపమ పాత్ర కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉండడమే కాకుండా డైలాగ్స్ కూడా ఉండవు ” అంటూ సదురు వెబ్సైట్ రాస్కొచ్చింది . ఇక ఈ లైన్స్ పై అనుపమ సీరియస్ గా రియాక్ట్ అయింది .

“మాటలు రాని పాత్రకి డైలాగ్స్ లేవు అని.. రాసిన మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను ” అంటూ సెటైరికల్ గా ఘాటుగా మెసేజ్ చేసింది . దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అనుపమ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో అనుపమ టైం అసలు బాగలేదు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news