టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ హీరోగా పేరు సంపాదించుకున్న సందీప్ కిషన్ తాజాగా నటించిన సినిమా “ఊరు పేరు భైరవకోన”. ఫుల్ టు ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కావాలి. అయితే ప్రీమియర్స్ ఒకరోజు ముందుగానే ప్రదర్శించారు . దీంతో సినిమా టాక్ బయటకు వచ్చేసింది . మనకు తెలిసిందే గత కొంతకాలంగా హిట్ లేకుండా అల్లాడిపోతున్న టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. అదే విధంగా ప్రమోషన్స్ కూడా చేశారు . సినిమాలో కూడా కంటెంట్ బాగా ఉంది అంటూ ప్రమోషన్స్ నిర్వహించారు . సినిమా సినిమాకి డిఫరెంట్ వేరియేషన్స్ తో కష్టపడుతున్న సందీప్ కిషన్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా..? లేక తుస్సు మనిపించాడా..? అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
మొదటినుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకునే సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన కథను కూడా అదే విధంగా చూస్ చేసుకున్నాడు . కథ చాలా డిఫరెంట్ .. డైరెక్టర్ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు . స్క్రిప్ట్ కూడా బాగా రాసుకున్నాడు . కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఎలివేషన్స్ సెకండ్ హాఫ్ లో చూపించలేకపోయాడు . హీరోయిన్స్ కావ్య ధాపర్.. వర్షా బొల్లమ్మ కూడా తమదైన స్టైల్ లో నటించి మెప్పించారు . ఈ చిత్రానికి ప్లస్ మ్యూజిక్ . శేఖర్ చంద్ర ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు . బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది . మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సస్పెన్స్ ట్విస్ట్ అదిరింది .
ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా బాగా నెట్టుకొచ్చిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మాత్రం ఆ ట్వీస్ట్ లను పెట్టడంలో .. తాను అనుకున్న కథను జనానికి చెప్పడంలో ఫ్లాప్ అయ్యాడు . పెద్దగా సెకండాఫ్ జనాలకు ఆకర్షణీయంగా అనిపించలేదు. సందీప్ కిషన్ నటన మాత్రం బాగుంది . తన వంతు ఈ సినిమా హిట్ అవ్వడానికి సహాయపడ్డాడు . ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో ఇదే బెస్ట్ అంటున్నారు జనాలు . అంతేకాదు సెకండ్ హాఫ్ కొంచెం బాగా రాసుకొని ఉంటే ఈ సినిమా ఇంకా మంచి హిట్ అందుకునేది అని చెప్పుకొస్తున్నారు . మరి ముఖ్యంగా నిజమేనా చెబుతున్న అనే సాంగ్ యువతను విపరీతంగా ఆకట్టుకునేస్తుంది . సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తంగా ఒకసారి సినిమా చూడొచ్చు అంటూ చెబుతున్నారు అభిమానులు . చూద్దాం మరి ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?