ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. నందమూరి అభిమానులకు పెద్ద భారంగా తయారయింది. నిన్న మొన్నటి వరకు ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు ఇది పెద్ద పిడుగు లాంటి వార్త అనే చెప్పాలి .ప్రశాంత్ నీల్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనకంటూ ఇండస్ట్రీలో స్పెషల్ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు .
రీసెంట్ గానే సలార్ సినిమాతో ఆ స్థానాన్ని డబల్ చేసుకున్నాడు. అంతకుముందు కే జి ఎఫ్ ఆ తర్వాత సలార్ అంటూ తన పేరుపై పెద్ద చరిత్ర సృష్టించుకున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ తాజాగా తీసుకున్న నిర్ణయం నందమూరి అభిమానులకు హర్టింగా అనిపిస్తుంది . సలార్ ముగిసిన వెంటనే తారక్ తో ప్రశాంత్ సినిమా చేయాల్సి ఉంది . అయితే సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ..
ఇక వెయిట్ చేస్తే పార్ట్ 2 పై మళ్లీ జనాలకు రకరకాల డౌట్లు వస్తాయి అని ..భావించిన ప్రశాంత్ – సలార్ ఫీవర్ తగ్గక ముందే సలార్ 2 కూడా స్టార్ట్ చేసి త్వరగా విడుదల చేసేయాలని డిసైడ్ అయ్యారట .దీంతో ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమా మరింత ఆలస్యం కానుంది . ఇది డార్లింగ్ ఫాన్స్ కు గుడ్ న్యూస్ అయినా తారక్ ఫ్యాన్స్ కు మాత్రం చాలా దిగులు పెట్టించే న్యూస్ అంటున్నారు జనాలు..!!