Moviesవామ్మో.. ఆఖరికి మహేశ్ ఫ్యాన్స్ కూడా ఇలా తయారైయారా..? పబ్లిక్ లో...

వామ్మో.. ఆఖరికి మహేశ్ ఫ్యాన్స్ కూడా ఇలా తయారైయారా..? పబ్లిక్ లో ఈ పనులు ఏంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో తమ ఫేవరెట్ హీరోని అభిమానులు ఎంతలా కొలుస్తారో .. ఆరాధ్య దైవంగా భావిస్తారో మనకు తెలిసిందే. అయితే ఆ విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ మరి ముందుకు వెళ్లిపోయారు. మహేష్ బాబుని దేవుని చేసేసారు . దానికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలై యావరేజ్ టాక్ అందుకుంది .

మహేష్ బాబు ఫ్యాన్స్ కి తప్పిస్తే ఈ సినిమా మిగతా ఎవరికి నచ్చడం లేదు. మరి కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా నచ్చడం లేదు. ఈ క్రమంలోనే అమలాపురంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. కృష్ణుడి రూపంలో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలమని రాసి పెట్టారు. ఈ ఫ్లెక్సీ నెట్టింట వైరల్ కావడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు.

” మీ దేవుడు మీ హీరో అంటే మీకు ఎంతైనా అభిమానం ఉండొచ్చు.. కానీ ఇలా దేవుడి గెటప్లో చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ..?” .. మరికొందరు ఇలా మీ పిచ్చి అభిమానంతో రోడ్లు బ్లాక్ చేసేస్తే పక్కవాళ్లకు ఎంత ఇబ్బంది ఆలోచించారా ..?? అంటూ మండిపడుతున్నారు . మరి కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇలా తయారయ్యారేంటిరా బాబు అంటూ మండిపడుతున్నారు . మొత్తానికి గుంటూరు కారంతో మహేష్ బాబుకి ఎంత పాజిటివిటీ వచ్చిందో తెలియదు కానీ ట్రోలింగ్ నెగిటివిటీ అయితే బాగానే వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news