Moviesసైంధవ్ ఫస్ట్ డే కలెక్షన్స్: ఇంత దారుణంగా పడిపోయింది ఏంటి.. కేవలం...

సైంధవ్ ఫస్ట్ డే కలెక్షన్స్: ఇంత దారుణంగా పడిపోయింది ఏంటి.. కేవలం సింగిల్ డిజిట్..!!

ఈసారి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద టైప్ ఇచ్చుకున్నారు స్టార్ హీరోలు . గుంటూరు కారం సినిమా పేరిట మహేష్ బాబు.. హనుమాన్ సినిమాతో తేజా సజ్జ.. సైంధవ్ సినిమాతో వెంకటేష్ ..నా సామరంగ సినిమాతో అక్కినేని నాగార్జున బాక్సాఫీస్ వద్ద తమ లక్ ని పరీక్షించుకోవడానికి ట్రై చేశారు . కాగా నాలుగు సినిమాలలోను హనుమాన్ సినిమా ది నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది .

ఆ తర్వాత గుంటూరు కారు ఆ తర్వాత సైంధవ్ సినిమాలు నిలుచున్నాయి. నా సామరంగ సినిమా ఈరోజు రిలీజ్ అయింది . ఇంకా పూర్తి టాక్ బయటికి రాలేదు . ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బయటపడ్డాయి . వెంకటేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సైంధవ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పడిపోయాయి . కేవలం నాలుగు అంటే నాలుగు కోట్లు మాత్రమే వచ్చాయి .

ఈ క్రమంలోనే వెంకటేష్ అభిమానులు ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు . సినిమాలో చాలా మ్యాటర్ ఉంది . కధ, కంటెంట్ కూడా బాగుంది. శైలేష్ కొలను డైరెక్షన్ కూడా బాగుంది. పాజిటివ్ టాక్ వచ్చిన ఎందుకు కలెక్షన్స్ పడిపోయాయి అనేది అర్థం కావడం లేదు. హనుమాన్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం వల్ల అందరూ హనుమాన్ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అంతేకాకుండా శ్రీ లీల డాన్స్ బాగుంది అంటూ గుంటూరు కారం కి వెళ్లడానికి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు . ఈ క్రమంలోనే సైంధవ్ సినిమాను ఎవరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు .. మే బి ఆ కారణంగా కలెక్షన్స్ పడిపోయి ఉండొచ్చు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news