MoviesNBK 109: టాలీవుడ్ స్టార్ హీరోల‌కు లేని ల‌క్కీ ఛాన్స్...

NBK 109: టాలీవుడ్ స్టార్ హీరోల‌కు లేని ల‌క్కీ ఛాన్స్ బాల‌య్య కొట్టేశాడుగా…!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా తిరుగులేని ఫామ్‌లో ఉన్నారు. అఖండ‌, వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలు మూడు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. 30 ఏళ్ల త‌ర్వాత బాల‌య్య హ్యాట్రిక్ హిట్ కొట్ట‌డంతో బాల‌య్య మార్కెల్‌, క్రేజ్ మామూలుగా లేదు. ప్ర‌స్తుతం బాల‌య్య బాబి ద‌ర్శ‌క‌త్వంలో సాలిడ్ యాక్ష‌న్ డ్రామాలో న‌టిస్తున్నాడు. ఇది బాల‌య్య కెరీర్‌లో 109వ సినిమాగా తెర‌కెక్కుతోంది.

ఈ సినిమా కోసం నంద‌మూరి అభిమానులు ఎంతో ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కంప్లీట్ అవుతోంది. ఈ సినిమాలోనూ బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశారంటే చాలు ఆ సినిమా సూప‌ర్ హిట్ అన్న సెంటిమెంటే ఎక్కువుగా ఉంటుంది. ఇటీవ‌ల బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్లు అన్నీ కూడా ద్విపాత్రాభిన‌యం చేసిన‌వే.

ఇక ఎన్బీకే 109 రిలీజ్ విష‌యంలో బాల‌య్య‌కు సూప‌ర్ ఛాన్స్ ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఈ యేడాది జూన్ వ‌ర‌కు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్సులు లేవు. ఎన్టీఆర్ దేవ‌ర‌, రామ్‌చ‌ర‌ణ్ గేమ్‌ఛేంజ‌ర్‌, బ‌న్నీ పుష్ప 2 సినిమాలు అన్నీ వాయిదా ప‌డ‌నున్నాయి. అంటే ఈ స‌మ్మ‌ర్ అంతా పెద్ద సినిమాలు లేకుండా వేస్ట్ అయ్యేలా ఉంది.

ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకుంటూ బాల‌య్య సినిమా ఈ స‌మ్మ‌ర్‌కు సోలోగా రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది. బాల‌య్య వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి రెండు సినిమాలు గ‌ట్టి పోటీ మ‌ధ్య‌లో రిలీజ్ అయ్యాయి. ఎన్బీకే 109 పోటీ లేకుండా సోలోగా రిలీజ్ అయితే సినిమాకు మంచి టాక్ వ‌స్తే అదిరిపోవ‌డం ఖాయం. ఏప్రిల్ – జూన్ మ‌ధ్య‌లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమా బాల‌య్య‌ది ఒక్క‌టి మాత్ర‌మే. సో స‌మ్మ‌ర్‌లో బాల‌య్య టాలీవుడ్ సినీ ల‌వ‌ర్స్‌కు మంచి ట్రీట్ ఇవ్వ‌నున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news