Movies"గుంటూరు కారం"లో మహేశ్ బాబు కి అలాంటి జబ్బు.. ట్రైలర్ లో...

“గుంటూరు కారం”లో మహేశ్ బాబు కి అలాంటి జబ్బు.. ట్రైలర్ లో బిగ్ సీక్రేట్ లీక్ చేసిన త్రివిక్రమ్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రివిక్రమ్ మార్క్ క్లియర్గా కనిపించింది . అంతేకాదు మహేష్ బాబు గత సినిమాలకు ఎప్పుడు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకునేవాడు .

కానీ ఈ సినిమాల విషయంలో సెన్సార్ కట్ లేకుండా చెలరేగిపోయాడు. నోటికి వచ్చిన పదాలను అవలీలగా మాట్లాడేస్తూ మాస్ జాతర చూపించాడు. ట్రైలర్ లో మహేష్ అభిమానులకు కావాల్సిన మాస్ మసాలా దట్టంగా దట్టించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు. ఈ సినిమాలో మహేష్ బాబు స్టైల్ డైలాగ్ డెలివరీ ఆటిట్యూడ్ ఫ్యాన్స్ ను ఫిదా చేసేసింది . అంతేకాదు ట్రైలర్ లో “చూడగానే మజా వచ్చిందా..?, హార్ట్ బీట్ పెరిగిపోయిందా ..? ఈలవేయాలనిపించిందా..? ఆట చూస్తావా ..? అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి”.

అయితే ఈ ట్రైలర్ మొదట్లో మహేష్ బాబు చిన్నప్పుడు కంట్లో నిప్పురవ్వ పడుతున్నట్లు చూపిస్తారు. బహుశా మహేష్ కి కంటికి సంబంధించిన ఏదైనా జబ్బు ఉన్న మనిషిగా మనం ఈ సినిమాలో ఆయన చూడాలి ఏమో. అంతేకాదు హీరోయిన్ ని చూసేటప్పుడు కూడా ఒక కన్ను మూసి చూస్తూ ఉంటాడు. దీన్ని బట్టి చూస్తుంటే మహేష్ బాబుకి ఏదో వింత జబ్బే పెట్టినట్లు ఉన్నాడు త్రివిక్రమ్ అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news