సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయనకంటూ ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది . అందరూ ఆయనని దేవుడిలా హీరోలా కాకుండా ఒక అన్నలా భావిస్తారు. అలాంటి రేర్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా తక్కువ మందికే ఉంటుంది . రీసెంట్గా ఆయన నటించిన దేవరకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయింది. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన గ్లింప్స్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది.
ఎన్టీఆర్ ని ఆది సినిమా తర్వాత మళ్లీ అంతటి మాస్ రేంజ్ లో ఈ సినిమాలోనే చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ బాగా పొగిడేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఫ్యాన్స్ జూనియర్ అనే ట్యాగ్ ఎన్టీఆర్ కి తీసేసి “మాన్ అఫ్ మాసస్” అనే ట్యాగ్ ఇచ్చారు . ఈ సినిమాల్లో మాస్ నెస్ తో ఇరగదీసేసాడు ఎన్టీఆర్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త ట్యాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇన్నాళ్లు మనం తారక్ ని జూ ఎన్టీఆర్ అని పిలిచాం.. ఇక పై మాత్రం “మ్యాన్ ఆఫ్ మాసెస్ “అనే పిలవాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఏ మాటకు ఆ మాటే దేవర లో మన తారక్ ఇరగదీశేశాడు. చించి పడేశాడు. ఆ లాస్ట్ చెప్పిన డైలాగ్ కెవ్వు కేక అంతే. తారక్ ఖాతాలో మరో హిట్ పక్క అంతే ..రాసి పెట్టుకోండి..!!