Moviesశీర‌త్‌క‌పూర్ స్లిమ్ సీక్రెట్ తెలిస్తే.. ప్ర‌తి ఒక్క‌రు ఫాలో అయిపోతాం...!

శీర‌త్‌క‌పూర్ స్లిమ్ సీక్రెట్ తెలిస్తే.. ప్ర‌తి ఒక్క‌రు ఫాలో అయిపోతాం…!

అప్పుడప్పుడో 9 సంవత్సరాల క్రితం టాలీవుడ్‌లో శర్వానంద్ హీరోగా వచ్చిన రన్ రాజా రన్ సినిమాలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది స్లిమ్ బ్యూటీ శీరత్ కపూర్ ఆమె ఫిజిక్ లో ఏ మాత్రం మార్పు రాలేదు. అలా అని శీరత్ ఫుల్లుగా డైటింగ్ చేస్తుందనుకుంటే పొరపాటు డైటింగ్ పేరిట కడుపు మాడ్చుకోవటం తనకు ఇష్టం ఉండదని స్వీట్స్, చాక్లెట్స్ తింటాను కాకపోతే అన్ని లిమిట్ గా తింటాను.. నాకు స్పెషల్గా న్యూట్రిషనిస్ట్ కూడా ఎవరూ లేరు.

ఇంట్లో వండిన ఆహారమే తింటాను.. రెగ్యులర్గా వ్యాయామం చేస్తాను.. మనం ఎంత తినాలనేది బాడీయే మనకు చెప్తుంది.. అది ఫాలో అయితే చాలు ఏదైనా తినొచ్చు అని శీరత్ చెబుతోంది. నేను రెగ్యులర్‌గా బట్టర్ చికెన్, దాల్ మఖ్నీ, చికెన్ బిర్యాని, చాక్లెట్ తింటాను.. ఇతర ఫుడ్ విషయానికి వస్తే ఇటాలియన్ రుచులు అంటే తనకు ఎంతో ఇష్టం అని శీర‌త్‌ చెబుతోంది. ఇలా తాను ఎలాంటి డైట్ ఫాలో అవ్వను అనే విషయాన్ని బయట పెట్టేసింది.

అన్ని రుచులు ట్రై చేయాలని కాకపోతే లిమిట్ లో ఉంటానని చెబుతోంది. ఏరోజైనా కాస్త ఎక్కువ తిన్నట్టు అనిపిస్తే వెంటనే తన జిమ్ ట్రైనర్ కు చెబుతానని మిగతా విషయాలు అన్నీ అతడే చూసుకుంటాడని శీరత్ తెలిపింది. ఇక రోజు ఉదయం వేడి నీళ్లలో కాస్త నిమ్మ‌రసం, తేనే వేసుకుని తాగుతాను ఆ వెంటనే జిమ్‌కు వెళతాను ఇంట్లో ఉండిన టిఫిన్ చేస్తాను షూటింగ్ కు వెళ్లిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఇంటికి వచ్చేసి కుటుంబ సభ్యులతో డిన్నర్ చేసి పడుకుంటానని శీరత్ తెలిపింది.

ఎప్పుడైనా విహారయాత్రలకు వెళ్లాలనిపిస్తే చాలు దేశాల పట్టుకుని తిరగన‌ని.. హిమాలయాలకు మాత్రమే వెళతానని శీరత్ చెప్పింది. ఏది ఏమైనా శీరత్ డైట్ సీక్రెట్ ఫాలో అయితే ఎంత స్లిమ్ గా ఉండొచ్చో తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news