Moviesమరికొద్ది గంటల్లో "గుంటూరు కారం" రిలీజ్.. ఫ్యాన్స్ కి ఎగిరి గంత్తేసే...

మరికొద్ది గంటల్లో “గుంటూరు కారం” రిలీజ్.. ఫ్యాన్స్ కి ఎగిరి గంత్తేసే న్యూస్ చెప్పిన త్రివిక్రమ్..!!

కొద్ది గంటలే ..కేవలం మరికొద్ది గంటల్లోనే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో గుంటూరు కారం కి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి . మరికొద్ది గంటల్లో రిలీజ్ అనగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమా కి భారీ హైప్స్ ఇస్తూ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు . ఈ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

మన సాఫ్ట్ హీరో మహేష్ బాబు ఈ సినిమా కోసం ఎంత హార్డ్ గా కష్టపడ్డాడో ఒక వీడియోతోనే తెలిసిపోతుంది . అంతేకాదు ఈ మేకింగ్ వీడియోలో మహేష్ బాబు కష్టం కళ్లకి కట్టినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ప్రజెంట్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్లు దాటేస్తుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

ఈ మూవీ నుంచి రిలీజైన ‘కుర్చీ మడతపెట్టి ’ సాంగ్ కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా ఈ పాటే మోత మోగిపోతోంది. ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా శ్రీలీల నటిస్తుంటే మీనాక్షి చౌదరి ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబులు కీలక పాత్రలను పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news