ఎస్ ఇది నిజమే చిరంజీవి హిట్ సినిమా తర్వాత అతడికి సినిమా ఛాన్సులు రాలేదు. ఎవరికి అయినా సినిమా హిట్ అయితే వెంటనే వరుసగా సినిమా ఛాన్సులు వస్తుంటాయి. కానీ చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమా హిట్ అయ్యాక అతడికి సినిమా ఛాన్సులు రాకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? ఇది నిజం. ప్రముఖ హాస్య దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన హిట్ కామెడీ సినిమా చంటబ్బాయ్. ఈ సినిమలో చిరు సహాసినితో కలిసి తెరను పంచుకున్నారు.
ఈ సినిమా అంతా కూడా కామెడీకే ఎక్కువ స్కోప్ ఉంటుంది. స్టోరీలో థ్రిల్ ఉన్నా మెజార్టీ సీన్లు అన్నీ కామెడీ బేస్ మీద కొనసాగుతాయి. నిజానికి ఈ సినిమాను చిరంజీవి జంధ్యాలకు ఇచ్చిన మాట ప్రకారమే చేశాడని అంటారు. చిరు కథ విన్నాక బాగుందని చెప్పారు. కానీ కామెడీ ట్రాక్‌తో మొత్తం నింపేస్తారని చిరు భావించలేదు. సినిమలో డైలాగుల నుంచి నటన వరకు అన్నీ కూడా చిరు అభినయం.. అన్నీ హైలెట్గా ఉంటాయి.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత చిరంజీవికి వరుసగా ఇలాంటి కామెడీ కథలతో కూడిన సినిమాలే వచ్చాయి. అలా వరుసగా కామెడీ ట్రాక్‌లతో కూడిన సినిమాలు రావడం.. తన ఇమేజ్‌కు తగినట్టుగా కథలు రాక చిరు ఇబ్బంది పడ్డారని అంటారు. కామెడీ + సెంటిమెంట్ ట్రాక్‌తో కూడిన కథలే రావడంతో చిరు వాటిని కాదనలేక బాగా ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని చిరు బావమరిది, నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా చెప్పారు.
ఈ సినిమా తర్వాత చిరు సినిమాలు చేసేందుకు ఆరు నెలల పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చిందట. తన ఇమేజ్‌కు తగిన కథను ఎంపిక చేసుకోవడంలో చిరు ఆ టైంలో బాగా టైం తీసుకోవాల్సి వచ్చింది. అలాగని చంటబ్బాయ్ సినిమాలో నటించింనదుకు చిరంజీవి ఎప్పుడూ బాధపడలేదని కూడా అల్లు అరవింద్ చెప్పారు. దీనిని ఒక ప్రయోగంగా భావించారట. అయితే చంటబ్బాయ్ ప్రభావం పోవడానికి, ప్రేక్షకులను మెప్పించడానికి చిరు ఎంతో కష్టపడాల్సి వచ్చిందట.