సాధారణంగా హీరోయిన్ అన్న తర్వాత హిట్లు వస్తూ ఉంటే సినిమాకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. తొలి సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే ప్రతి సినిమాకు పెంచుకుంటూ పోవటం కామన్‌గా జరిగే ప్రక్రియ. కెరీర్ ప్రారంభంలో అవకాశాలు ఇచ్చిన వారిపట్ల హీరోయిన్లు కృతజ్ఞతతో, అభిమానంతో ఉంటారు. తర్వాత వారికి సినిమాలు చేసి పెట్టమన్నా చేస్తారు. కాని రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గరు. అయితే ఈ రెమ్యూనరేషన్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కు, స్టార్ డైరెక్టర్ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మధ్య చిచ్చు పెట్టిందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
పూజ హెగ్డేను – త్రివిక్రమ్ బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. వరుసగా ఎన్టీఆర్, బన్నీ సినిమాలలో అవకాశాలు ఇవ్వడంతో పాటు ఆ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒక్కసారిగా పూజా కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కేరీర్ ప్రారంభంలో సినిమాకు 30 నుంచి 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకునే పూజ.. ఇప్పుడు ఒక్కో సినిమాకు మూడు నుంచి మూడున్నర కోట్లు డిమాండ్ చేస్తుంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని త్రివిక్రమ్ పట్టుబట్టి పూజని హీరోయిన్గా తీసుకున్నారు.
అది మహేష్‌కు ఇష్టం లేదు. చివరకు ఏం జరిగిందో గాని పూజ ఈ సినిమా నుంచి అవుట్ అయింది. మహేష్ గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ మరోసారి బన్నీతో పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని పూజను హీరోయిన్గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పేసారట. అయితే త్రివిక్రమ్ కాస్త రెమ్యూనరేషన్ తగ్గించుకోమని అడిగితే ఇది పాన్ ఇండియా సినిమా కదా.. మీ మీద అభిమానం నాకు ఎప్పుడూ తగ్గదు.. అయితే సినిమా.. సినిమాయే కదా క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకొవాలి కదా సార్.. రెమ్యూనరేషన్ మాత్రం తగ్గించుకోను అని మొహమాటం లేకుండా చెప్పేసిందట.
ఇండస్ట్రీలో శ్రీలీల, రష్మిక లాంటి కొత్త హీరోయిన్లు వచ్చిన పూజ చేతిలో ఒకటి రెండు సినిమాలు ఉన్నాయి. ఈ టైం లో బన్నీ సినిమాలో ఛాన్స్ అంటే ఆమెకు బంపర్ ఆఫర్ లాంటిదే.. అయితే రెమ్యూనరేషన్ విషయంలో ఆమె పంతానికి పోవడంతో త్రివిక్రమ్ ఆమెపై రగిలిపోతున్నారని.. నువ్వు కాకపోతే మరో కొత్త హీరోయిన్ను తీసుకు వస్తాను అని కూడా ఆమెకు సవాల్‌ను విసిరారని ప్రచారం జరుగుతోంది.