నటరత్న ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్న ఆయన నిర్మించి, నటించి త్రిపాత్ర అభినయం చేయడంతో పాటు దర్శకత్వం వహించిన దానవీరశూరకర్ణ సినిమాకు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెక్కుచెదరని స్థానం ఉంటుంది. దానవీరశూరకర్ణ సినిమా తెరకెక్కటం వెనక చాలా చరిత్ర ఉంది. చాలామంది అప్పటి టాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో నటించేందుకు ముందుకు రాలేదు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమా తీస్తున్నారని తెలిసి సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాకు పోటీగా మహాభారతం కథ ఆధారంగా మరో సినిమా ప్లాన్ చేశారు.
అప్పుడు టాలీవుడ్‌లో పేరు ఉన్న నటీనటులు అందరినీ ఆయన తీసుకువెళ్లిపోయారు. అయితే ఎన్టీఆర్ తాను త్రిపాత్ర అభినయం చేయాలని నిర్ణయించుకున్నారు. కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు పాత్రలు ఆయనే వేశారు. ఈ సినిమాకు ఆయనే నిర్మాత, ఆయనే దర్శకుడు. తన ఇద్దరు కుమారులు హరికృష్ణ, బాలకృష్ణకు కూడా రెండు పాత్రలు ఇచ్చేశారు. ఇండస్ట్రీలో తనకు సన్నిహితంగా ఉండే చలపతిరావు లాంటి వాళ్లకు కీలకపాత్రలు కట్టబెట్టారు. ఈ సినిమా నిర్మించే సమయంలో ఎన్టీఆర్ బ్యాంకు ఖాతాలో కేవలం రూ.15 లక్షల ఉంది. పది లక్షల బడ్జెట్ ఈ సినిమాకు కేటాయించారు.
ఈ ఖర్చు చూసే బాధ్యతలను ఎన్టీఆర్ మూడో కుమార్తె ఉమామహేశ్వరికి అప్పగించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో అన్నగారి బంధువులు పనిచేశారు. బడ్జెట్ దాటిపోయింది.. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వచ్చి ఎన్టీఆర్ పై విరుచుకుపడ్డారు. అసలే పౌరాణిక సినిమాల నుంచి అక్కినేని, శోభన్ బాబు వంటి వారు కూడా తప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా తీస్తే ఎవరు చూస్తారు అని.. హరికృష్ణ రోజులు మారాయి అంటూ.. బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ పై అసహనం వ్యక్తం చేశారట. మొత్తం కుటుంబం నుంచి వ్యతిరేకత రావడంతో ఈ సినిమా ఎవరూ చూడకపోతే ఫ్రీగా చూపిస్తా అని ——పేరు చేశారట.
దీనికి తోడు ఈ సినిమా రన్ టైం ఏకంగా 3:30గం.. వచ్చింది. కట్ చేయటానికి కూడా ఎన్టీఆర్ ఇష్టపడలేదు. చివరకు ఎన్టీఆర్ తో పాటు కృష్ణ ఈ సినిమాకు వ్యతిరేకంగా తెరకెక్కిమచిన సినిమా కూడా ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. కృష్ణ సినిమా డిజాస్టర్ అయింది. దానవీరశూరకర్ణకు వారం రోజుల్లో తిరుగులేని బ్లాక్ బస్టర్ వచ్చింది. ఆ రోజుల్లోనే కోటి రూపాయలకు పైగా నికరా లాభం ఎన్టీఆర్‌కు వచ్చింది. రిపీట్ రన్ లోను ఈ సినిమా 100 రోజులు ఆడింది. మరో విచిత్రం ఏంటంటే ఈ సినిమాను మూడోసారి రిలీజ్ చేసినప్పుడు కూడా వంద రోజులు ఆడింది.