Moviesమహేశ్ ఫ్యాన్స్ దెబ్బకి త్రివిక్రమ్ భయపడ్డారా..? క్రిస్మస్ స్పెషల్ "గుంటూరు కారం"...

మహేశ్ ఫ్యాన్స్ దెబ్బకి త్రివిక్రమ్ భయపడ్డారా..? క్రిస్మస్ స్పెషల్ “గుంటూరు కారం” పోస్టర్ లో ఈ మార్పు చూశారా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ప్రజెంట్ మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే . సంక్రాంతి కానుకగా జనవరిలో ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక్కొక్క పాట రిలీజ్ అవుతూ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది.

ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాకి సంబంధించిన అప్డేట్స్ పై మహేష్ ఫ్యాన్స్ ఎంత ఫైర్ అయ్యారో చూశాం. బహుశా త్రివిక్రమ్ ఫ్యాన్స్ కోపానికి బాగా హర్ట్ అయినట్లు ఉన్నాడు, అందుకే నెక్స్ట్ రిలీజ్ చేసిన అప్డేట్ మాత్రం చాలా కూల్ గా ప్లెసెంట్ గా ఉండేలా చూసుకున్నాడు . ఒక్కరు కూడా తప్పు పట్టకుండా ఉండే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు .

క్రిస్మస్ కానుకగా గుంటూరు కారం సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు . ఇందులో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా న్యూ లుక్ తో ఆకట్టుకున్నాడు . అంతేకాదు ఇప్పటివరకు గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ప్రతి పోస్టర్ లోను మహేష్ బాబు సిగరెట్ తాగుతూ కనిపించాడు. అయితే ఈ పోస్టర్ లో మాత్రం అలా ఏమీ లేకుండా గుడ్ బాయ్ లా కనిపించాడు . దీంతో ఫ్యాన్స్ ఈ లుక్ కి ఫిదా అవుతున్నారు . త్రివిక్రమ్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news