నటసింహం నందమూరి బాలకృష్ణ మంచి స్వింగులో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఇలా హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతూ ఇటు బుల్లితెరను కూడా షేక్ చేసి పడేస్తున్నాడు. బాలయ్య బుల్లితెరపై హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ కూడా బాలయ్యకు సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. నిజానికి ఈ షో వల్లే బాలయ్య ఈ తరం జనరేషన్‌కు బాగా కనెక్ట్ అయ్యాడు.
ఇక భగవంత్ కేసరి తర్వాత బాలయ్య బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య కెరీర్‌లో 109వ సినిమాగా తెరకెక్కనుంది. ఇది బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ సినిమాగా కాకుండా.. ఫ్యాక్షన్‌తో పాటు పొలిటికల్, ఎమోషనల్ టచ్ ఉంటుందని చెపుతున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు.
ఇప్పటికే ఊర్శశీ రౌతేలా, మీనాక్షీ చౌదరి ఎంపికయ్యారు. మీనాక్షి చౌదరి పాత్ర ప్లాష్‌బ్యాక్‌లో ఉంటుందని.. ఆమె మీద ఓ సాంగ్ ఉందని తెలుస్తోంది. ఇక మూడో హీరోయిన్‌గా ఓ సీనియర్ హీరోయిన్ పేరు పరిశీలనలో ఉందంటున్నారు. భగవంత్ కేసరిలో బాలయ్య స్టెప్పుల్ని చూసే ఛాన్స్ ప్రేక్షకులకు రాలేదు. అయితే ఈ సినిమాలో 5 సాంగ్స్ కూడా ఉండడంతో ఫ్యాన్స్ బాలయ్య స్టెప్పులతో ఎంజాయ్ చేయొచ్చు..!