Moviesక‌ళ్యాణ్‌రామ్ పాలిట‌ ఆమే పెద్ద ల‌క్కీ హీరోయిన్ అయ్యిందిగా....!

క‌ళ్యాణ్‌రామ్ పాలిట‌ ఆమే పెద్ద ల‌క్కీ హీరోయిన్ అయ్యిందిగా….!

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ వ‌రుస ప్లాపుల త‌ర్వాత గ‌తేడాది వ‌చ్చిన బింబిసార సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఆల్ టైం హిట్ సినిమాగా నిల‌వ‌డంతో పాటు సీతారామం లాంటి సూప‌ర్ హిట్ సినిమాకు పోటీగా వ‌చ్చి కూడా రు. 50 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాలో సంయుక్త మీన‌న్‌, కేథ‌రిన్ థెస్రా హీరోయిన్లుగా న‌టించారు.

ఇక ఇటీవ‌ల కాలంలో సంయుక్త మీన‌న్ టాలీవుడ్‌లో ల‌క్కీ హీరోయిన్‌గా మారింది. వ‌రుస‌గా సార్‌, భీమ్లానాయ‌క్‌, విరూపాక్ష‌, బింబిసార లాంటి హిట్ల‌తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు మ‌రోసారి ఆమె క‌ళ్యాణ్‌రామ్ డెవిల్ సినిమాలోనూ న‌టించింది. అభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై అభిషేక్ నామా స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ముందుగా ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా అనుకున్న న‌వీన్ మేడారంకు నిర్మాత‌కు పొస‌గ‌లేదు. దీంతో అభిషేక్ నామా తానే ద‌ర్శ‌కుడిగా మారి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. క‌ళ్యాణ్‌రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా న‌టిస్తున్నాడు. సినిమా క‌థ‌, క‌థ‌నాలు బాగున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది. యానిమ‌ల్‌తో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

మ‌రీ సంయుక్త మీన‌న్ మ‌రోసారి క‌ళ్యాణ్‌రామ్ పాలిట ల‌క్కీ హీరోయిన్ అవుతుందేమో చూడాలి. ఈ సినిమాను ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news