Newsజాక్ పట్ ఆఫర్ కొట్టేసిన రైతు బిడ్డ.. ఏ జన్మలో ఏం...

జాక్ పట్ ఆఫర్ కొట్టేసిన రైతు బిడ్డ.. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాడో..ఇంత మంచి ఛాన్స్ వచ్చింది..!

ఒకప్పుడంటే సినిమాలో అవకాశాలు దక్కించుకోవడం చాలా చాలా కష్టంగా ఉండేది . ఇప్పుడైతే సోషల్ మీడియా పుణ్యం అంటూ సామాన్య జనాలు కూడా సినిమాలో నటించే ఛాన్సులు అందుకుంటున్నారు . మరీ ముఖ్యంగా యూట్యూబ్ వచ్చాక పలు ఛానల్స్ తో పాపులారిటీ దక్కించుకొని క్రేజ్ సంపాదించుకొని.. తద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు కొందరు జనాలు .

తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు రైతు బిడ్డగా పాపులారిటీ సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ . బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో తన అద్భుతమైన పర్ఫామెన్స్ చూపిస్తూ ట్రోఫీ కొట్టగలడు అని ప్రూవ్ చేసుకుంటున్నా పల్లవి ప్రశాంత్ కు సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా చిన్న – పెద్ద, ఆడ – మగ తేడా లేకుండా అందరూ కూడా ఆయనను మంచి మనసుతో ఎంకరేజ్ చేస్తున్నారు .

ఇప్పటికే 12 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న పల్లవి ప్రశాంత్ కచ్చితంగా .. ఈ సీజన్ కి విన్నర్ గా నిలుస్తాడు అంటుంటే .. మరికొందరు విన్నర్ కాకపోయినా రన్నర్ మాత్రం కచ్చితంగా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే పల్లవి ప్రశాంత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ అంటూ తెలుస్తుంది . ఆయనకు బిగ్ బాస్ షో అంటే చాలా చాలా ఇష్టమట .

అంతేకాదు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాడట . మరి ముఖ్యంగా ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ పర్ఫామెన్స్ ఆయనను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ప్రస్తుతం ఆయన పవన్ తో తెరకెక్కిస్తున్న ఉస్దాత్ భగత్ సింగ్ మూవీలో ఓ మంచి పాత్రను ఇవ్వాలనుకుంటున్నాడట. ఫిలింనగర్ లో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఫినాలే ఎపిసోడ్లో గెస్ట్ గా వచ్చి హరీష్ ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తాడు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో పల్లవి ప్రశాంత్ కనిపిస్తే కెవ్వు కేకే అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news