Newsయానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్: "త్వరలోనే అభిమానులకు బిగ్ సర్...

యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్: “త్వరలోనే అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్”..ఫోటోతో హింట్ ఇచ్చేసిన రష్మిక..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందన్నా పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా యానిమల్ సినిమా రిలీజ్ అయ్యాక అమ్మడి పేరు సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . ఈ సినిమాలో ఎప్పుడు కనిపించని విధంగా రష్మిక మందన్నా.. బోల్డ్ గా కనిపించడం అభిమానులకు తీవ్ర డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రష్మికను ఏకేస్తున్నారు జనాలు. అయితే రీసెంట్గా రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రష్మిక మందన్నా కొన్ని పిక్చర్స్ షేర్ చేస్తూ..” బ్యూటిఫుల్ నైట్ ఇన్ ఢిల్లీ “అంటూ క్యాప్షన్ ఇచ్చింది . అంతేకాదు త్వరలోనే సర్ప్రైజ్ అంటూ కూడా చెప్పుకొచ్చింది . అయితే అదే బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఫొటోస్ ను మృణాల్ ఠాకూర్ షేర్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ సినిమా నైట్ షూట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ రెండు ఫొటోస్ ఒకే దగ్గర దిగిన్నట్లుగా ఉన్నాయ్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ సినిమాలో రష్మిక కూడా ఉండబోతుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అంతేకాదు ఈ సినిమాలో రష్మిక మందన్నా గెస్ట్ రోల్లో కనిపించబోతుందట . విజయ్ దేవరకొండ – మృణాల్ ఠాకూర్ మధ్య రష్మిక మందన్నా నటించే సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నాయట . దీంతో ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా హిట్ పక్కా అంటున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news