పాపం సమంత ఏం చేసినా సరే అది ఆమెకు నెగిటివ్ గానే మారుతుంది. సమంత సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తే ఫ్లాప్ అయిపోతున్నాయి. ఆమె ఏదైనా యాడ్ చేస్తే ఎక్కువగా పబ్లిసిటీ తెచ్చుకోవడం లేదు . ఇవన్నీ కాదులే ఎలాగైనా లైఫ్ లో సెటిల్ అవ్వాలి అంటూ కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే హీరోయిన్ సమంత “ట్రాలాల” అని ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసిన విషయం తెలుసు.
అయితే ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం వెనుక తెలుగు ఇండస్ట్రీలో బడా హీరో ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఏ ముహూర్తన స్టార్ట్ చేసిందో కానీ వెంటనే అక్కినేని ఫ్యామిలీ నుంచి రివర్స్ కౌంటర్ దెబ్బ స్టార్ట్ అయింది సమంతకి అనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. మరీ ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీకి ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది . అయినా సరే అక్కినేని నాగచైతన్య కోసం మరొక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నారట .
అది కూడా సమంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన రెండు రోజులకే ఇంకొక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. సమంతతో కంపేర్ చేస్తే అక్కినేని ఫ్యామిలీ చాలా బాగా రిచ్. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ . మరి వాళ్ళ దెబ్బకు సమంత ప్రొడక్షన్ హౌస్ తట్టుకుంటుందా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . మరికొందరు నాగచైతన్య గూబ గుయ్యమనే దెబ్బ వేశాడు అంటూ సమంత ని ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు ఎవరి టాలెంట్ వాళ్లది .. ఎవరీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది అంటూ సమంతను ఎంకరేజ్ చేస్తున్నారు..!!