Movies' స‌లార్ ' కు ఏపీలో ఫస్ట్ డే పెద్ద ఎదురు...

‘ స‌లార్ ‘ కు ఏపీలో ఫస్ట్ డే పెద్ద ఎదురు దెబ్బ‌… అదే కొంప‌ముంచిందా..!

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమాకు నూటికి నూరు శాతం పాజిటివ్ టాక్ వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సలార్ మానీయా కనిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా సలార్ నిలిచిపోతుందని బాలీవుడ్ ట్రేడ్‌ వర్గాలు సైతం అప్పుడే అంచనా వేస్తున్నాయి. అంటే సలార్‌కు ఏ రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చిందో తెలుస్తుంది.

సలార్ బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ సినిమాగా నిలవాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా రూ.800 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టాలి. ఈ సినిమాకు అన్ని ఏరియాలలో సాలిడ్ బిజినెస్ చేశారు. నిర్మాత విజయ్ కిరంగ‌దూర్‌ అయితే కొన్నిచోట్ల ఆయన చేసిన మిస్టేక్ ఇప్పుడు వసూళ్లపై ప్రభావం చూపనుంది. రెగ్యులర్‌గా ఏరియాల వారీగా లీడింగ్ లో ఉండే టాప్ డిస్ట్రిబ్యూటర్లకు ఆయన హక్కులు ఇవ్వలేదు. కొన్ని చోట్ల కావాలని తన స్నేహితులకు సలార్ హక్కులు కట్టబెట్టారు. ఇలా కొత్త డిస్ట్రిబ్యూటర్లు రంగంలోకి దిగారు.

ముఖ్యంగా ఏపీలో కీలకమైన గుంటూరు, కృష్ణాజిల్లా ప్రాంతాల్లో రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు కానీ కె.ఎస్.ఎన్ టెలి ఫిలిమ్‌కు హక్కులు ఇచ్చారు. అయితే వీళ్ళు థియేటర్లతో అడ్వాన్సులు.. అగ్రిమెంట్లు చేసుకునే విషయంలో సరిగ్గా డీల్ చేయలేదు. ఏపీలో ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపులు కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. అక్కడ సినిమాకు కేవలం రూ.40 మాత్రమే అదనంగా పెంచారు. గతంలో ఆది పురుష్‌ సినిమాకి రూ.50 పెంచారు. అయితే ఇప్పుడు సలార్ సినిమాకు ఆ సినిమాతో పోలిస్తే పది రూపాయలు తక్కువగా పెంచారు.

దీంతో ఏపీలో వసూళ్లపై పెద్ద దెబ్బ పడింది. ఇక ఓవర్సీస్ లో అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ చేస్తున్నారు. ఈ కారణంగా ఓపెనింగ్స్ పై ఈ సినిమా బిజినెస్ నిర్ణయాలు ప్రభావం చూపించేలా ఉన్నాయి. సినిమాను సాధారణంగా పెద్ద డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసి ఉంటే.. వారు పర్ఫెక్ట్ గా ప్రమోట్ చేసుకొని భారీ అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చేలా చేసేవారు. కానీ ఏపీలో సలార్ విషయంలో అలా జరగలేదు. ఈ కారణంగానే ఆంధ్ర ప్రాంతంలో సలార్‌కు తొలి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావని మాట వినిపిస్తోంది. అదే జరిగితే కచ్చితంగా నిర్మాత తీసుకున్న అతిపెద్ద రాంగ్ డెసిషన్ గా ఇది మిగిలిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news