Newsయానిమల్ ట్రోల్స్ పై స్పంచించిన రష్మిక.. "ప్రతి మహిళా అలానే చేయాలి"...

యానిమల్ ట్రోల్స్ పై స్పంచించిన రష్మిక.. “ప్రతి మహిళా అలానే చేయాలి” అంటూ బోల్డ్ స్టేట్మెంట్..!!

సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన యానిమల్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . సినిమా రిలీజ్ అయ్యి దాదాపు వారం దాటిపోయింది . అయినా సరే ఇప్పటికే యానిమల్ హిట్ తగ్గలేదు. ప్రతి ఒక్క సెలబ్రిటీ యానిమల్ పై ట్వీట్ చేస్తూ రోజు రోజుకు యానిమల్ పై మరింత బజ్ క్రియేట్ చేసేస్తున్నారు . ఇప్పటికే 550 కోట్లు దాటేసింది . ఇక సుమారు 700 కోట్లు దాటుతుంది అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అంతేకాదు యానిమల్ సినిమాను ఢీకొట్టే సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా మరింత రేంజ్ లో ముందుకెళ్తుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే సినిమా లో రష్మిక పర్ఫామెన్స్ బోల్డ్ గా ఉంది అంటూ చాలామంది ట్రోల్ చేశారు. ఇన్నాళ్లు భరించిన రష్మిక ఇప్పుడు దానిపై ఓపెన్ అప్ అవుతూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.

“ఇందులో గీతాంజలి పాత్ర ప్రతి మహిళకి ఆదర్శం .. తన బిడ్డల కోసం ఏమైనా చేస్తుంది .. ఒక మహిళ అంటూ ప్రూవ్ చేసింది . ఇలాంటి పాత్ర నాకు ఇచ్చినందుకు సందీప్ రెడ్డివంగా కు చాలా చాలా ధ్యాంక్స్ ” అంటూ తనదైన స్టైల్ లో పోస్ట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news