అక్కినేని నాగ చైతన్యని మీడియానే బాగా ఇబ్బందులకి గురి చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేము మనుషులమే..మాకూ అన్నీ ఇష్టాలుంటాయి..కోరికలుంటాయి..కోపాలుంటాయి. కానీ, వాటిని బయటకి ఇంకోలా పోట్రేట్ చేసి కొన్ని మీడియా ఛానల్స్ అనవసరంగా ఇంకొకరిని లాక్కొచ్చి అందులో ఇరికించి కేవలం హెడ్డింగుల కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నారని చైతూ బాధపడ్డాడు.
సమంతతో ప్రేమ, పెళ్లి ఆ తర్వాత విడాకులు. ఇదేమీ కొత్త విషయం కాదు. నా జీవితంలోనే కరిగిన విషయం అస్సలు కాదు. చాలామంది జీవితాలలో జరుగుతుంది. కానీ, మేము సినీ తారలవడం వల్ల ఎక్కువగా ఫోకస్ అవుతున్నాము. నా జీవితంలో జరిగిన ఈ ఫేజ్ ఏదైతే ఉందో అది అనుకోకుండా జరిగింది. కోర్టు మాకు విడాకులు మంజూరు చేసింది.
ఇదంతా లీగల్ గానే జరిగింది. మేము విడాకులు తీసుకొని కూడా రెండేళ్ళు అయిపోయింది. అయినా దాన్నే పట్టుకొని సాగదీసి రక రకాల వార్తలు క్రియేట్ చేసి అందులో ఇంకొకరిని ఇరికించి వాళ్లని ఇబ్బందులకి గురి చేసి వారి ఫ్యామిలీస్ ని టార్గెట్ చేయడం నచ్చడం లేదని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య ఓపెన్ గా చెప్పాడు.
మీడియా వల్లే ఎక్కువ డ్యామేజ్ జరిగిందని ఉన్నదానికి పది కల్పించి సృష్ఠించి మమ్మలిని ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకూ చైతూ ఇలా ఆవేదన చెందలేదు. మొదటిసారి ఇంతగా ఫీలయ్యాడంటే ఎప్పటి నుంచో మనసులో దాచుకున్న భావోద్వేగాన్ని ఇలా సమయం వచ్చి బయటపెట్టినట్టు అయింది. మరి ఇది చూసిన తర్వాత అయినా మీడియా వెబ్‌సైట్స్ న్యూసెన్స్ న్యూస్ రాయడం ఆపుతాయా లేదా చూడాలి.